బాలినేని వర్సెస్ దామచర్ల డైలాగ్ వార్ .. రంగంలోకి కూటమి నేతలు.. నెక్ట్స్ జరగబోయేది అదేనా
Actor ProfilePolitician

బాలినేని వర్సెస్ దామచర్ల డైలాగ్ వార్ .. రంగంలోకి కూటమి నేతలు.. నెక్ట్స్ జరగబోయేది అదేనా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
బాలినేని వర్సెస్ దామచర్ల డైలాగ్ వార్ .. రంగంలోకి కూటమి నేతలు.. నెక్ట్స్ జరగబోయేది అదేనా
10TV Telugu29 Nov 2026
బాలినేని వర్సెస్ దామచర్ల డైలాగ్ వార్ .. రంగంలోకి కూటమి నేతలు.. నెక్ట్స్ జరగబోయేది అదేనా

Balineni Vs Damacharla : ఆరని మంటగా ఆ ఇద్దరు మధ్య రాజకీయ వైరం నడుస్తూనే ఉంది. జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్‌ మధ్య టగ్ ఆఫ్‌ కంటిన్యూ అవుతోంది. బాలినేని వైసీపీలో ఉన్నప్పటి నుంచే ఆయనంటే దామచర్లకు గిట్టదు. ఆ తర్వాత బాలినేని జనసేనలో చేరినప్పటి నుంచి ఒంగోలు రాజకీయం రోజుకో టర్న్ తీసుకుంటోంది. ఇద్దరు కూటమి పార్టీలైన జనసేన, టీడీపీలోనే ఉండగా..ఒకరు టీడీపీ ఎమ్మెల్యేగా ఉంటే.. మరొకరు జనసేన లీడర్‌గా కొనసాగుతున్నారు. పాత వైరం మరోసారి తెరపైకి రావడంతో.. కొత్త టర్న్ తీసుకుంటూ..సవాళ్లు, ప్రతిసవాళ్లతో రాజకీయం రంజుగా మారుతోంది. దామచర్ల అడ్డగోలుగా అవినీతి చేస్తున్నారన్న బాలినేని ఆరోపిస్తే..వైసీపీ హయాంలో బాలినేని చేసిన కరప్షన్‌ గురించి చెప్పాలంటే పుస్తకాలు కూడా సరిపోవన్నారు దామచర్ల. లేటెస్ట్‌గా ఎమ్మెల్యే దామచర్లకు బాలినేని మరోసారి కౌంటరిచ్చారు. దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తనతో పోటీపడాలని సవాల్ చేశారు. ఇద్దరం ఇండిపెండెంట్‌లుగా పోటీ చేద్దామని..తాను 30 వేల మెజార్టీతో గెలుస్తానన్నారు. ఒకవేళ తాను ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. జనసేన లేకపోతే దామచర్ల అసలు ఎమ్మెల్యే అయ్యేవారా అంటూ బాలినేని క్వశ్చన్ చేయడం ఆసక్తికరంగా మారింది. పైగా జనసేన అధికార పార్టీగా ఉన్నా తమకు అధికారాలు లేవు..అలాంటి వాతావరణం లేదంటూ బాలినేని చేసిన కామెంట్స్ చర్చకు దారి తీస్తున్నాయి. కేవలం అధికార పార్టీలో ఉన్నామంటే ఉన్నా. ఎలాంటి పవర్స్‌ లేవంటూ బాలినేని చెప్పుకురావడం జనసేనలోనూ హాట్ టాపిక్ అవుతోంది. ఏడాదిన్నర కింద పార్టీలోకి వచ్చిన బాలినేని జనసేన పవర్స్ గురించి..అధికారం గురించి మాట్లాడటం ఏంటో అర్థం కావట్లేదన్న గుసగుసలు మొదలయ్యాయి. బాలినేని జనసేనలో చేరి ఉండకపోతే లోపల వేయించేవాడినని ఎమ్మెల్యే జనార్దన్‌ అంటే..అంతకు మించి అన్నట్లుగా బాలినేని కౌంటర్ అటాక్ చేశారు. తాను అవినీతి చేశాను అనుకుంటే సీఎం చంద్రబాబుకు చెప్పి విచారణ జరిపించాలని దామచర్లకు సవాల్ చేశారు బాలినేని