
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. PRTUTS: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం, పెండింగ్ డిమాండ్ల సాధన లక్ష్యంగా ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ తెలంగాణ రాష్ట్రం (PRTUTS) ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1న ధర్మ కార్యక్రమం నిర్వహించనున్నట్లు సంఘం నాయకత్వం ప్రకటించింది. ఈ మేరకు పోస్టర్ విడుదల చేసింది. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పులగం దామోదర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకల భిక్షం గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమానికి హాజరయ్యే ఉపాధ్యాయులు నీలి రంగు దుస్తులు ధరించాలని పీఆర్‌టీయూటీఎస్ నాయకత్వం సూచించింది. మహిళా ఉపాధ్యులు నీలిరంగు చీర లేదా చుడీదార్.. పురుష ఉపాధ్యాయులు బ్లూ కలర్ షర్ట్ లేదా టీ షర్టు ధరించాలని సూచించారు. ఉపాధ్యాయుల హక్కుల పరిరక్షణ, విద్యారంగ సమస్యల పరిష్కారం, ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే తమ ప్రధాన లక్ష్యమని సంఘం నాయకులు పేర్కొన్నారు. ఉపాధ్యాయులకు నూతన పీఆర్సీ ప్రకటించడం, పాత పెన్షన్ విధానం (OPS) పునరుద్ధరణ, ఖాళీ పోస్టుల భర్తీ, పదోన్నతులు, బదిలీల ప్రక్రియను వేగవంతం చేయడం, పాఠశాలల్లో మౌలిక సదుపాయాల మెరుగుదల వంటి పలు అంశాలపై ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఉపాధ్యాయుల సర్వీస్ సంబంధిత సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతున్నారు. 'అందరం ఒకటే' అనే నినాదంతో నిర్వహిస్తున్న ఈ ధర్మ కార్యక్రమం ద్వారా ఉపాధ్యాయుల గొంతుకను ప్రభుత్వానికి బలంగా వినిపించనున్నట్లు సంఘం నాయకులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, విద్యా నాణ్యత మెరుగుదల వంటి అంశాలపై పలు ఉపాధ్యాయ సంఘాలు తమ