Urban Company Share Price: దేశంలోనే అతిపెద్ద మ్యూచువల్ ఫండ్ సంస్థగా ఉన్నటువంటి ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ (SBI MF) అర్బన్ కంపెనీలో మరింత వాటా కొనుగోలు చేసింది. కంపెనీలో ఇప్పటికే వాటా కలిగి ఉన్న ఎస్బీఐ ఎంఎఫ్ ఇప్పుడు మరో 2 శాతం వరకు వాటాను దక్కించుకుంది. సుమారు 3.15 కోట్ల అర్బన్ కంపెనీ షేర్లను దాదాపు రూ. 428 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. బ్లాక్ డీల్ ద్వారా ఇక్కడ అర్బన్ కంపెనీలో షేర్లను కొనుగోలు చేసినట్లు తెలిసింది. అర్బన్ కంపెనీ ప్రారంభ దశలో పెట్టుబడులు పెట్టిన Accel, Vy Capital సంస్థలు ఇక్కడ బ్లాక్ డీల్‌లో తమ వాటాల్ని విక్రయించినట్లు తెలుస్తోంది. అయితే ఈ లావాదేవీకి సంబంధించిన అధికారిక వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.ఈ క్రమంలోనే అర్బన్ కంపెనీ షేర్లు గురువారం సెషన్లో పుంజుకున్నాయి. ఒకవైపు స్టాక్ మార్కెట్ నష్టాల్లో ఉన్నా ఈ స్టాక్ ఇంట్రాడేలో 5 శాతం వరకు దూసుకెళ్లింది. కిందటి సెషన్‌లో స్టాక్ ధర రూ. 139.05 వద్ద ముగియగా, ఆగస్ట్ 13న ఇంట్రాడేలో 5 శాతం పుంజుకొని రూ. 146 వద్ద సెషన్ గరిష్ఠాన్ని తాకింది. మార్కెట్ విలువ ప్రస్తుతం రూ. 20.75 వేల కోట్లుగా ఉంది. ఈ స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ. 201.18 కాగా, కనిష్ఠ ధర రూ. 100.70 గా ఉంది.భారీగా పెరుగుతున్న వాటాఅర్బన్ కంపెనీలో ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు ఇటీవలి కాలంలో క్రమంగా పెరుగుతున్నాయని చెప్పొచ్చు. 2025 డిసెంబరులో ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్‌కు అర్బన్ కంపెనీలో వాటా సుమారు 1.89 శాతంగా ఉండేది. ఇది 2026 మార్చి నాటికి దాదాపు 5.9 శాతానికి పెరిగింది. తాజా కొనుగోలుతో కలిపి ఇది 8 శాతానికి చేరే అవకాశం ఉంది. అంటే కేవలం ఇక్కడ కొన్ని నెలల వ్యవధిలోనే అర్బన్ కంపెనీలో ఎస్బీఐ ఎంఎఫ్ తన పెట్టుబడిని
Actor ProfilePolitician
బ్లాక్ డీల్ ద్వారా కోట్లల్లో షేర్లను కొనుగోలు చేసిన ఎస్బీఐ .. ఒక్కసారిగా దూసుకెళ్లిన షేరు
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•15 Dec 2026
బ్లాక్ డీల్ ద్వారా కోట్లల్లో షేర్లను కొనుగోలు చేసిన ఎస్బీఐ .. ఒక్కసారిగా దూసుకెళ్లిన షేరు