
ఫిల్మ్ ఇండస్ట్రీ సముద్రం లాంటిది.. అదొక సెపరేట్ వరల్డ్.. ఎన్నో సినిమాలు, షూటింగ్ లో,మర్చిపోలేని సంఘటను.. తవ్వినా కొద్ది వస్తూనే ఉంటాయి. కొన్ని సంఘటనలు మాత్రం ఎప్పటికీ అలా గుర్తుండిపోతాయి. అలాంటి ఒక ఆసక్తికరమైన సంఘటనను నందమూరి బాలకృష్ణ ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. 'ఆదిత్య 369' సినిమా షూటింగ్ సమయంలో నటి సిల్క్ స్మిత, బాలకృష్ణను ఇంగ్లీషులో ఘాటుగా తిట్టిన విషయాన్ని బాలయ్య బయటపెట్టారు. ఆ సమయంలో సెట్‌లో ఉన్నవారంతా షాక్‌కు గురైన సంఘటన గురించి ఆయన వివరించారు. బాలకృష్ణ వెల్లడించిన వివరాలు ప్రకారం.. ఆదిత్య 369 సినిమాలో సిల్క్ స్మిత కేవలం ఒక ఐటమ్ సాంగ్‌కే పరిమితం కాకుండా, సింహనందిని అనే ఒక పూర్తి స్థాయి పాత్రను పోషించారు. ఆ సినిమాలో ఆమెకు ఒక కీలకమైన సీన్ ఉంది. అందులో బాలకృష్ణ పోషించిన కృష్ణ కుమార్ పాత్రను ఉద్దేశించి ఆమె "ఈ నీచుడు, ఈ దుర్మార్గుడు, ఈ నికృష్టుడు" అంటూ తెలుగులో పెద్ద డైలాగ్ చెప్పాల్సి ఉంది. అయితే ఆ సమయంలో సిల్క్ స్మితకు తెలుగు అంతగా రాదు . పైగా ఆ డైలాగ్‌లో ఉన్నది తెలుగు మాత్రమే కాదు కాస్త గ్రాంథికం భాష కూడా కావడంతో ఆమెకు పలకడం చాలా కష్టంగా అనిపించింది షూటింగ్ టేక్ ప్రారంభం కాగానే, సిల్క్ స్మిత ఆ తెలుగు డైలాగ్‌ను పూర్తిగా మర్చిపోయింది. భావోద్వేగంతో డైలాగ్ చెప్పాల్సిన ఆ సీన్ లో, ఆమె తెలుగుకు బదులుగా ఇంగ్లీషులోకి మారిపోయి.. బాలకృష్ణను చూపిస్తూ.. "దిస్ ఫూల్, దిస్ ఇడియట్, దిస్ బాస్టర్డ్, దిస్ రాస్కల్" (This fool, This idiot, This bastard, This rascal) అంటూ చాలా కోపంగా తిట్టేసింది. ఆవేశంతో అలా తిట్టేసి, ఆ తర్వాత డైరెక్టర్ వైపు తిరిగి "డైరెక్టర్ గారు.. ఓకేనా అండి?" అని చాలా సాదాసీదాగా అడిగింది. సిల్క్ స్మిత నోటి వెంట బాలకృష్ణ లాంటి స్టార్ హీరోపై ఆ