బ్రెజిల్ కు గుండెకోత.. ప్రపంచకప్ నుంచి నిష్క్రమణ
Actor ProfileActor

బ్రెజిల్ కు గుండెకోత.. ప్రపంచకప్ నుంచి నిష్క్రమణ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
బ్రెజిల్ కు గుండెకోత.. ప్రపంచకప్ నుంచి నిష్క్రమణ
Sakshi24 Sept 2026
బ్రెజిల్ కు గుండెకోత.. ప్రపంచకప్ నుంచి నిష్క్రమణ

ఆరో సారి ఫిఫా వరల్డ్‌కప్‌ గెలవాలనుకున్న మాజీ ఛాంపియన్‌ బ్రెజిల్‌ ఆశలు అడియాశలయ్యాయి. నార్వే స్టార్ స్ట్రైకర్ ఎర్లింగ్ హాలాండ్ బ్రెజిల్‌ ఆశలను అడియాశలు చేశాడు. 2026 ఎడిషన్‌లో భాగంగా ఇవాళ జరిగిన ప్రీ క్వార్టర్‌ ఫైనల్లో బ్రెజిల్‌పై నార్వే 2-0 గోల్స్‌ తేడాతో గెలుపొంది, తొలిసారి క్వార్టర్‌ ఫైనల్‌కు అర్హత సాధించింది. ఈ దెబ్బతో బ్రెజిల్‌ మెగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. క్వార్టర్ ఫైనల్లో నార్వే ఇంగ్లండ్‌ లేదా మెక్సికోతో తలపడుతుంది. ఒంటికాలితో తన్నేశాడు..! బ్రెజిల్‌ ప్రపంచకప్‌ కలను హాలాండ్‌ ఒంటికాలితో తన్నేశాడు. మ్యాచ్‌ చివరి క్షణాల్లో (80, 90) లభించిన రెండు అవకాశాలను అద్భుతంగా సద్వినియోగం చేసుకుని రెండు గోల్స్ నమోదు చేశాడు. దీంతో బ్రెజిల్‌పై నార్వే చారిత్రక విజయం సాధించింది. బ్రెజిల్ ఆరో ప్రపంచకప్ కల చెదిరిపోయింది. ఈ మ్యాచ్‌లో బ్రెజిల్‌ అటాకింగ్‌ కంటే డిఫెన్స్‌కు అధిక ప్రాధాన్యత ఇచ్చి మూల్యం చెల్లించుకుంది. మరోవైపు నార్వే దూకుడుగా ఆడి బ్రెజిల్‌ను చావుదెబ్బ కొట్టింది. ఆ జట్టు తరఫున హాలాండ్‌, మార్టిన్ ఓడెగార్డ్, పాట్రిక్ బెర్గ్, ఆండ్రియాస్ షెల్డెరప్ అద్భుతంగా ఆడారు. వరుసగా ప్రమాదకర దాడులు చేశారు. 78వ నిమిషానికి నార్వే 523 పాస్‌లు పూర్తి చేయగా, బ్రెజిల్ కేవలం 203 పాస్‌లతోనే సరిపెట్టుకోవడం మ్యాచ్‌పై నార్వే ఆధిపత్యాన్ని స్పష్టంగా చూపించింది. బ్రెజిల్‌కు సైతం అవకాశాలు వచ్చినా..! బ్రెజిల్‌కు సైతం మ్యాచ్‌లో పలు కీలక అవకాశాలు వచ్చినా వాటిని గోల్స్‌గా మలచలేకపోయింది. బ్రునో గిమరాయెస్ కొట్టిన పెనాల్టీని గోల్‌కీపర్ ఓర్జన్ నైలాండ్ అద్భుతంగా అడ్డుకున్నాడు. గాబ్రియెల్ మార్టినెల్లి ప్రయత్నాన్ని కూడా నైలాండ్ నిలువరించాడు. ప్రత్యామ్నాయ ఆటగాడు ఎండ్రిక్‌కు వినీషియస్ జూనియర్ అందించిన చక్కని అవకాశాన్ని కూడా గోల్‌గా మార్చలేకపోయాడు. 68వ నిమిషంలో స్టార్‌ స్ట్రైకర్‌ నెయ్‌మార్ బరిలోకి దిగినా దాడుల్లో పెద్ద మార్పు రాలేదు. స్టాపేజ్ టైమ్‌లో (90+10) నెయ్‌మార్ పెనాల్టీ ద్వారా ఒక గోల్ చేసినా అప్పటికే ఆలస్యమైపోయింది. 80

బ ర జ ల క గ డ క త ప రప చకప న చ న ష క రమణ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in