బ్రెజిల్ కథ అదే వ్యథ
Actor ProfileActor

బ్రెజిల్ కథ అదే వ్యథ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
బ్రెజిల్ కథ అదే వ్యథ
Andhra Jyothy30 Sept 2026
బ్రెజిల్ కథ అదే వ్యథ

హాట్‌ ఫేవరెట్‌ బ్రెజిల్‌ కల చెదిరింది. ఆరోసారి ప్రపంచ విజేతగా నిలవాలన్న సాంబా జట్టుకు ఈసారీ చుక్కెదురైంది. హాలాండ్‌ డబుల్‌ స్ట్రయిక్‌తో స్రాంబా జట్టును చిత్తుచేసిన నార్వే.. తొలిసారి క్వార్టర్స్‌... క్వార్టర్స్‌కు నార్వే ఫ నిష్క్రమించిన సాంబా జట్టు హాట్‌ ఫేవరెట్‌ బ్రెజిల్‌ కల చెదిరింది. ఆరోసారి ప్రపంచ విజేతగా నిలవాలన్న సాంబా జట్టుకు ఈసారీ చుక్కెదురైంది. హాలాండ్‌ డబుల్‌ స్ట్రయిక్‌తో స్రాంబా జట్టును చిత్తుచేసిన నార్వే.. తొలిసారి క్వార్టర్స్‌ బెర్త్‌ పట్టేసి చరిత్ర సృష్టించింది. ఇక, మ్యాచ్‌లో ఓ గోల్‌ కొట్టి అలరించిన బ్రెజిల్‌ స్టార్‌ నెమార్‌.. జట్టు ఓటమితో తీవ్ర భావోద్వేగానికి గురై ఏకంగా ఆటకు వీడ్కోలు పలకడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. మరో థ్రిల్లింగ్‌ ఫైట్‌లో ఆతిథ్య మెక్సికోపై నెగ్గిన ఇంగ్లండ్‌ సెమీ్‌సలో చోటు కోసం నార్వేను ఢీకొనేందుకు సిద్ధమైంది. ఈస్ట్‌ రూథర్‌ఫోర్డ్‌ (యూఎస్‌): చివరి నిమిషాల్లో ఎర్లింగ్‌ హాలాండ్‌ మెరుపు దాడులతో.. బ్రెజిల్‌ వరల్డ్‌కప్‌ కలల సౌధం కుప్పకూలింది. సోమవారం జరిగిన రౌండ్‌-16 మ్యాచ్‌లో బ్రెజిల్‌ 1-2తో నార్వే చేతిలో ఓడి ఇంటిముఖం పట్టింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో డబుల్‌ ధమాకాతో విజృంభించిన హాలాండ్‌ (79వ, 90వ నిమిషం).. మెగా ఈవెంట్‌ చరిత్రలో తొలిసారి నార్వేను క్వార్టర్స్‌ చేర్చి సూపర్‌ హీరో అయిపోయాడు. అంతిమ క్షణాల్లో నెమార్‌ (90+10వ) పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలచినా.. అప్పటికే సాంబా జట్టు ఓటమి ఖరారైంది. నార్వే గెలుపులో గోల్‌ కీపర్‌ ఓర్జన్‌ నైలాండ్‌ కూడా కీలకపాత్ర పోషించాడు. ప్రత్యర్థి స్పాట్‌ కిక్‌తోపాటు దాదాపు నాలుగు ప్రయత్నాలను అడ్డుకొన్నాడు. స్పాట్‌ కిక్‌ మిస్‌..: మ్యాచ్‌లో బ్రెజిల్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగినా.. నార్వే గట్టిపోటీ ఇవ్వడంతో పోరు ఆసక్తిగా మారింది. ఆరంభం నుంచి ఇరుజట్లూ బంతిపై ఆధిపత్యం కోసం పోరాడాయి. కానీ, సాంబా టీమ్‌కు ముందుగానే పైచేయి సాధించే అవకాశం పెనాల్టీ రూపంలో వచ్చింది. 14వ నిమిషంలో కున్హాను పెనాల్టీ ఏరియాలో మొరటుగా అడ్డుకొన్నారు

బ ర జ ల కథ అద వ యథ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in