
సినిమా ఇండస్ట్రీలో రాణించడం అంత ఈజీ కాదు. చాలా మంది అవకాశాల కోసం ఎదురుచూస్తుంటే కొంతమంది మాత్రం అవకాశాలు వచ్చిన సక్సెస్ తెచ్చుకోవడానికి నానా కష్టాలు పడుతుంటారు. ఇది ఎక్కువగా మనం హీరోయిన్స్ విషయంలో చూస్తుంటాం. హిట్స్ లేకపోయినా.. అవకాశాలు తగ్గిపోయిన కనిపించకుండా పోతుంటారు హీరోయిన్స్.. హీరోలు మాత్రం హిట్ కోసం పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉంటారు. అఖిల్ లాంటి స్టార్ కిడ్ కు కూడా ఐదు సినిమాల తర్వాత హిట్ అందుకున్నాడు. ఇలా చాలా మంది ఉన్నారు. వారిలో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరో ఒకడు. చాలా మంది కుర్ర హీరోలు మాత్రం హిట్స్ కోసం ఎంతో కష్టపడుతున్నారు. సాలిడ్ హిట్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేసిన సక్సెస్ కాలేకపోతున్నారు. ఈ యంగ్ హీరో కూడా అదే లిస్ట్ లోకి వస్తాడు. ఈ కుర్రాడికి టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది.. కానీ హిట్స్ మాత్రం లేవు.. సినిమాల్లో హిట్స్ కంటే ప్లాప్స్ ఎక్కువ.. అయినా కూడా ఆయన క్రేజ్ ఎక్కడ తగ్గలేదు. మొత్తంగా ఆయన 33 సినిమాలు చేస్తే 25సినిమాలు ఫ్లాపులు. కేవలంఎనిమిది సినిమాలే హిట్ అయ్యాయి. ఇంతకూ ఆహీరో ఎవరో కాదు టాలీవుడ్ కుర్ర హీరో నితిన్. జయం సినిమాతో హీరోగా పరిచయమైన నితిన్ ఆతర్వాత దిల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆతర్వాత వరుసగా సినిమాలు చేశాడు. కానీ నితిన్ ఖాతాలో హిట్స్ మాత్రం పడలేదు. అప్పట్లో నితిన్ వరుసగా 13 ఫ్లాప్స్ అందుకున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో నితిన్ సై అనే సినిమా చేశాడు. ఈ సినిమా భారీ హిట్ అందుకుంది. ఈ సినిమా తర్వాత వరుసగా 13 ఫ్లాప్స్ అందుకున్నాడు. చాలా కాలం తర్వాత ఇష్క్ సినిమాతో హిట్ అందుకున్నాడు. ఇష్క్ తర్వాత, గుండె జారీ గల్లంతయ్యిందే సినిమాతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ ఫ్లాపులు అందుకున్నాడు. ఆ మధ్య