
సాక్షి, అమరావతి: అమరావతి కార్యక్రమాలను కూటమి అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వేళ.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గైర్హాజరు కావడం ఇప్పుడు రాజకీయంగా కొత్త చర్చకు తెరలేపింది. సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా పాల్గొన్న కీలక కార్యక్రమానికి పవన్ కావాలనే దూరంగా ఉన్నారంటూ అధికార, రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. గురువారం అమరావతిలో స్టీల్ బ్రిడ్జి, ఎమ్మెల్యేల క్వార్టర్లు, సీడ్ యాక్సిస్ రోడ్డు వంటి కీలక ప్రాజెక్టుల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే అదే సమయంలో పవన్ కల్యాణ్ విశాఖపట్నం పర్యటనకు వెళ్లడం చర్చనీయాంశమైంది. ఏనుగుల కార్యక్రమం ఉందంటూ ఉదయమే ఆయన విశాఖకు వెళ్లినట్లు తెలుస్తోంది. అదీ షెడ్యూల్‌లో హడావిడిగా చేర్చుకుని మరీ.. ప్రభుత్వ వర్గాలకు సరైన సమాధానం ఇవ్వకుండానే!. నారాయణ రాయబారం విఫలం! పవన్ కల్యాణ్ కార్యక్రమానికి హాజరయ్యేలా చేయడానికి అమరావతి పనుల్ని చూసుకుంటున్న మంత్రి నారాయణను చంద్రబాబు రంగంలోకి దింపారు. ఈ క్రమంలోనే నిన్న పవన్‌తో నారాయణ భేటీ అయినట్లు సమాచారం. ఎలాగైనా అమరావతి కార్యక్రమానికి రావాలని ఆయన కోరినప్పటికీ.. చివరకు పవన్ తన నిర్ణయాన్ని మార్చుకోలేదన్న చర్చ సాగుతోంది. విశాఖ పర్యటనకు వెళ్లడంతో ఆ ప్రయత్నాలు ఫలించలేదనే సంకేతాలు వెలువడుతున్నాయి. చంద్రబాబుపై తగ్గిన పవన్ స్పందనలు గత కొంతకాలంగా చంద్రబాబు, టీడీపీ ప్రభుత్వ వ్యవహారాలపై పవన్ కల్యాణ్ స్పందనలు తగ్గడం కూడా రాజకీయ పరిశీలకుల దృష్టిని ఆకర్షిస్తోంది. గతంలో చంద్రబాబును ఆకాశానికి ఎత్తిన పవన్.. ఈ మధ్యకాలంలో అలాంటి స్టేట్‌మెంట్‌లకు దూరంగా ఉంటున్నారు. అంతేకాదు పాలనాపరమైన అంశాలు, పార్టీ వ్యవహారాల్లోనూ తన దారి తనదే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. బాబును పొగడాల్సి వస్తుందనే అమరావతి వంటి కీలక కార్యక్రమానికి ఆయన దూరంగా ఉన్నారా? అని చర్చించుకుంటున్నారు. ఎమ్మెల్యేల క్వార్టర్ల అంశమే కారణమా? పవన్ కల్యాణ్ అమరావతి కార్యక్రమానికి దూరంగా ఉండటానికి ఎమ్మెల్యేల క్వార్టర్ల నిర్మాణంపై ఉన్న అభ్యంతరాలే కారణమన్న ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో