బాబోయ్ ఏపీలో మంచు కురిసే ప్లేస్ ఉందా? ఆంధ్రా కాశ్మీర్ పూర్తి వివరాలు మీకోసం
Actor ProfileCelebrity

బాబోయ్ ఏపీలో మంచు కురిసే ప్లేస్ ఉందా? ఆంధ్రా కాశ్మీర్ పూర్తి వివరాలు మీకోసం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
బాబోయ్ ఏపీలో మంచు కురిసే ప్లేస్ ఉందా? ఆంధ్రా కాశ్మీర్ పూర్తి వివరాలు మీకోసం
Asianet News Telugu5 Nov 2026
బాబోయ్ ఏపీలో మంచు కురిసే ప్లేస్ ఉందా? ఆంధ్రా కాశ్మీర్ పూర్తి వివరాలు మీకోసం

ఆంధ్రప్రదేశ్‌లో మంచు కురిసే ప్రాంతం ఉందంటే ఎవరైనా నమ్ముతారా? కానీ ఇది అక్షరాలా నిజం. సౌత్ ఇండియాలోనే చలికాలంలో అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఏకైక ప్రాంతం మన లంబసింగి. అందుకే ఈ ప్రాంతాన్ని "ఆంధ్రా కాశ్మీర్" అని పిలుస్తారు. విశాఖపట్నం జిల్లాలోని చింతపల్లి మండలంలో సముద్ర మట్టానికి దాదాపు 1000 నుంచి 1025 మీటర్ల ఎత్తులో ఉన్న ఒక చిన్న అందమైన గ్రామం ఇది. విశాఖపట్నం నగరం నుండి కేవలం 100 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ హిల్ స్టేషన్, ప్రస్తుతం ప్రకృతి ప్రేమికులకు, పర్యాటకులకు మోస్ట్ ఫేవరెట్ స్పాట్‌గా మారిపోయింది. లంబసింగికి స్థానికంగా కొర్రబయలు అనే మరో పేరు కూడా ఉంది. స్థానిక భాషలో కొర్ర అంటే కర్ర అని, బయలు అంటే బయట అని అర్థం. అంటే చలికాలంలో ఎవరైనా రాత్రి పూట ఇళ్లల్లో ఉండకుండా బయట ఓపెన్ ప్లేస్‌లో ఉంటే, చలికి వాళ్లు కర్రలా గడ్డకట్టుకుపోతారని దీని అర్థం. ఇక్కడి చలి తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో చెప్పడానికి ఈ పేరే ఒక పెద్ద ఉదాహరణ. చలికాలంలో ఇక్కడ ఉష్ణోగ్రతలు ఒక్కోసారి 0 డిగ్రీల కంటే తక్కువకు పడిపోతాయి. 2008 డిసెంబర్, 2011 జనవరి నెలల్లో ఇక్కడ ఉష్ణోగ్రతలు సున్నా డిగ్రీల కంటే కిందకు పడిపోయిన రికార్డులు ఉన్నాయి. లంబసింగి వాతావరణం చాలా విచిత్రంగా, మ్యాజికల్‌గా ఉంటుంది. సాధారణ రోజుల్లో కూడా ఇక్కడ ఉదయం 10 గంటల వరకు సూర్యుడు అస్సలు కనిపించడు. దట్టమైన పొగమంచు కమ్మేసి ఉంటుంది. ఇక చలికాలం విషయానికి వస్తే, డిసెంబర్, జనవరి నెలల్లో చల్లటి గాలులు వణికిస్తాయి. మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా సూర్యుడు సరిగ్గా రాడు. మళ్లీ మధ్యాహ్నం 3 గంటలు దాటిందంటే చాలు, దట్టమైన పొగమంచు రోడ్లను పూర్తిగా కప్పేస్తుంది. పక్కనే ఉన్న మనుషులు కూడా కనిపించనంతగా మంచు కురుస్తుంది. కొన్నిసార్లు తెల్లవారుజామున ఇక్కడ తేలికపాటి మంచు కూడా

బ బ య ఏప ల మ చ క ర స ప ల స ఉ ద ఆ ధ ర క శ మ ర ప ర త వ వర ల మ క స Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in