
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు త్వరలో తల్లి కాబోతున్నారు. తన భర్త, దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి హాలిడేలో ఉన్న ఆమె, తాజాగా కొన్ని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఈ చిత్రాలలో సమంత ప్రెగ్నెన్సీ గ్లోతో, స్పష్టంగా కనిపిస్తున్న బేబీ బంప్‌తో ఎంతో ఆనందంగా దర్శనమిచ్చారు. 'జస్ట్ అస్' (మేము మాత్రమే) అనే క్యాప్షన్‌తో పాటు గడియారం, బేబీ ఎమోజీలను జోడించి తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.హాలిడే సందర్భంగా ఈ జంట రుచికరమైన భోజనాన్ని ఆస్వాదిస్తూ, షాపింగ్ చేస్తూ, కాఫీ తాగుతూ, పికిల్‌బాల్ ఆడుతూ కనిపించారు. ఈ పోస్ట్‌పై సమంత స్నేహితురాలు క్రేషా బజాజ్ "కౌంట్‌డౌన్ మొదలైంది" అని కామెంట్ చేయడం, సమంత బిడ్డ రాక సమీపిస్తోందన్న సంకేతాలను ఇచ్చింది. ఈ ఫొటోలు చూసిన అభిమానులు, సినీ ప్రముఖులు సమంత దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.నిజానికి సమంత తన ప్రెగ్నెన్సీ విషయాన్ని గత జులైలోనే అధికారికంగా ప్రకటించారు. హైదరాబాద్‌లో జరిగిన తన తాజా చిత్రం 'మా ఇంటి బంగారం' విజయోత్సవ సభలో ఆమె మాట్లాడుతూ.. "క్షమించండి, ఇంకో చిన్న గ్యాప్ తీసుకుని మళ్లీ వస్తాను. ఇప్పుడు నేను మెటర్నిటీ లీవ్ తీసుకోవాలని నాకు తెలుసు. కానీ, నేను చాలా సంతోషంగా ఉన్నాను" అని తెలిపి, సినిమాల నుంచి తాత్కాలిక విరామం తీసుకుంటున్నట్లు వెల్లడించారు.సమంత, రాజ్ నిడిమోరుల వివాహం 2025లో జరిగింది. ఇద్దరికీ ఇది రెండో వివాహం. సమంత అంతకుముందు నటుడు నాగచైతన్యను 2017లో పెళ్లి చేసుకొని 2021లో