బోనాల వేళ రష్మిక కోసం విజయ్ దేవరకొండ స్పెషల్ విష్... వైరల్ అవుతున్న వీడియో
Actor ProfileActor

బోనాల వేళ రష్మిక కోసం విజయ్ దేవరకొండ స్పెషల్ విష్... వైరల్ అవుతున్న వీడియో

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
బోనాల వేళ రష్మిక కోసం విజయ్ దేవరకొండ స్పెషల్ విష్... వైరల్ అవుతున్న వీడియో
Zee Telugu22 Nov 2026
బోనాల వేళ రష్మిక కోసం విజయ్ దేవరకొండ స్పెషల్ విష్... వైరల్ అవుతున్న వీడియో

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. Vijay Deverakonda:బోనాల సందర్భంగా లాల్ దర్వాజ మహంకాళి ఆలయాన్ని సందర్శించిన విజయ్ దేవరకొండ, తన భార్య రష్మిక మందన్న క్షేమంగా ఉండాలని అమ్మవారిని కోరుతూ ప్రత్యేక పూజలు చేశారు. దీంతో ఆలయంలో విజయ్ చేసిన ప్రార్థనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. హైదరాబాద్‌లో బోనాల వేడుకలు వైభవంగా జరుగుతున్న వేళ పలువురు సినీ ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు. నటి నిహారిక కొణిదెల బంగారు బోనం సమర్పించిన అనంతరం విజయ్ దేవరకొండ, ఆయన సోదరుడు ఆనంద్ దేవరకొండ, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి ఆలయానికి వెళ్లారు. విజయ్ దేవరకొండ ఆలయానికి వచ్చారని తెలియడంతో పెద్ద సంఖ్యలో అభిమానులు, భక్తులు అక్కడికి చేరుకున్నారు. అమ్మవారి దర్శనం అనంతరం బయటకు వచ్చిన విజయ్‌తో ఫొటోలు, వీడియోలు తీసుకునేందుకు అభిమానులు ఆసక్తి చూపించారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ లాల్ దర్వాజ మహంకాళి అమ్మవారిని తాను తొలిసారి దర్శించుకున్నట్లు తెలిపారు. తన భార్య రష్మిక మందన్న క్షేమంగా ఉండాలని, ఆమె త్వరగా కోలుకోవాలని అమ్మవారి ఆశీస్సులు కోరినట్లు విజయ్ తెలిపారు. అలాగే తమ సందీప్ రెడ్డి వంగా ప్రొడక్షన్ హౌస్‌కు కూడా భద్రకాళి పేరు పెట్టిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. విజయ్ దేవరకొండ రష్మిక కోసం ప్రత్యేకంగా ప్రార్థించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బోనాల వేళ భార్య కోసం విజయ్ చేసిన ఈ ప్రత్యేక ప్రార్థన అభిమానులను ఆకట్టుకుంటోంది. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు

బ న ల వ ళ రష మ క క స వ జయ ద వరక డ స ప షల వ ష వ రల అవ త న న వ డ య Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in