హైదరాబాద్‌లో బోనాల వేడుకలు ఘనంగా జరిగాయి. ఆషాఢ మాస చివరి ఆదివారం కావడంతో భాగ్యనగరంలో బోనాల పండగ వాతావరణం అంబరాన్ని తాకింది. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. మీరాలంమండి శ్రీ మహంకాళేశ్వర ఆలయంలో జరిగిన బోనాల ఉత్సవాల్లో టాలీవుడ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా సందడి చేశారు. ఆలయం బయట డప్పు చప్పుళ్లకు డాన్స్ చేసి భక్తుల్లో జోష్ నింపారు. ఈ సందర్భంగా తెలంగాణ కల్చర్ గురించి చెబుతూ ఫరియా ఎమోషనల్ అయ్యారు.పాతబస్తీలోని ప్రసిద్ధ మీరాలంమండి మహంకాళేశ్వర ఆలయంలో నిర్వహించిన బోనాల ఉత్సవాలకు ఫరియా అబ్దుల్లా అతిథిగా హాజరయ్యారు. బోనం ఎత్తుకొని, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో పోతురాజుల విన్యాసాలు, డప్పు చెప్పుల మధ్య ఫరియా మాస్ డాన్స్ చేసి భక్తులను ఉత్సాహపరిచారు. బోనాల వేడుకల్లో ఫరియా డాన్స్ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న అనంతరం ఫరియా అబ్దుల్లా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. తెలంగాణ సంస్కృతి ఎంతో గొప్పదని ప్రశంసించారు. ఎలాంటి భేషజాలు లేకుండా అందరూ కలిసికట్టుగా ఉంటారని కొనియాడారు. హైదరాబాద్ సంస్కృతిలో భాగమైనందుకు తనకెంతో గర్వంగా ఉందన్నారు. ''తెలంగాణ కల్చర్ అంటే ఇలానే ఉంటుంది. అందరినీ యాక్సెప్ట్ చేస్తారు. కలిసి మెలిసి ఉంటారు. ఇలాగే ఉండాలి.అదే బెస్ట్'' అంటూ ఫరియా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ వీడియో కూడా నెట్టింట వైరల్ గా మారింది.\ఫరియా అబ్దుల్లా పక్కా హైదరాబాదీ అమ్మాయి. హైదరాబాదులోని బంజారాహిల్స్ లో ముస్లిం ఫ్యామిలీలో జన్మించారు. లయోలా కాలేజీలో మాస్ కమ్యూనికేషన్ పూర్తి చేశారు. ఆ సమయంలో 'నక్షత్ర' అనే షాట్ నటించారు. కాలేజీలో జరిగిన ఒక ఫంక్షన్ కి ముఖ్య అతిథిగా వచ్చిన దర్శకుడు నాగ్ అశ్విన్ దృష్టిలో పడి సినిమా ఛాన్స్ అందుకున్నారు. 'జాతిరత్నాలు' సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు. చిట్టిగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఫరియా
Actor ProfileActor
బోనాల వేడుకల్లో చిట్టి మాస్ స్టెప్పులు.. తెలంగాణ కల్చర్
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•28 Nov 2026
బోనాల వేడుకల్లో చిట్టి మాస్ స్టెప్పులు.. తెలంగాణ కల్చర్ గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్న ఫరియా అబ్దుల్లా