ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కుమార్తె వివాహ వేడుకలు ఘనంగా జరిగాయి. బండ్ల గణేష్ కుమార్తె జనని, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సూర్య తేజ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్‌లో అంగరంగ వైభవంగా జరిగిన వివాహ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటుగా.. మాజీ మంత్రి కేటీఆర్, ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత, స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, సినీ నటులు చిరంజీవి, నాగార్జున హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇక బండ్ల గణేష్ కుమార్తె వివాహానికి సంబంధించిన పలు వీడియోలు, ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.మరోవైపు బండ్ల గణేష్‌కు, చంద్రబాబు కుటుంబానికి మధ్య మంచి సంబంధాలు ఉన్న సంగతి తెలిసిందే. దీంతో సీఎం చంద్రబాబు తన సతీమణి నారా భువనేశ్వరితో కలిసి వివాహానికి హాజరయ్యారు. నూతన వధూవరులపై అక్షింతలు వేసి ఆశీర్వదించారు. వరుడు సూర్యతేజ చంద్రబాబు దంపతుల చేతుల మీదుగా తాళి అందుకుని మాంగళ్యధారణ చేయడం విశేషం. ఇక తన కుమార్తె పెళ్లికి చంద్రబాబు సతీసమేతంగా రావడంతో బండ్ల గణేష్ ఎమోషనల్ అయ్యారు. కన్నీళ్లు పెట్టుకున్నారు. దీంతో పక్కనే ఉన్న నటుడు బ్రహ్మాజీ ఆయనను ఊరడిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బండ్ల గణేష్ సినీ, రాజకీయాలకు చెందిన వ్యక్తి కావటంతో ఆయా రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు.చంద్రబాబుపై అభిమానంతో బండ్ల గణేష్ తన కుమార్తె వివాహ ఆహ్వాన పత్రికలోనూ ఆయన పేరు వేయించిన సంగతి తెలిసిందే. ఆహ్వాన పత్రిక పైభాగంలో శ్రీమతి నారా భువనేశ్వరి, శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆశీర్వాదాలతో అని రాయించడం అప్పట్లో వైరల్ అయ్యింది. అంతేకాదు.. 2023లో చంద్రబాబు నాయుడు జైలులో ఉన్న సమయంలో, ఆయన జైలు నుంచి విడుదల కావాలని, మళ్లీ సీఎం కావాలని బండ్ల గణేష్
Actor ProfilePolitician
బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి.. చంద్రబాబు దంపతుల చేతుల మీదుగా మాంగళ్యం అందుకున్న వరుడు
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•31 Dec 2026
బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి.. చంద్రబాబు దంపతుల చేతుల మీదుగా మాంగళ్యం అందుకున్న వరుడు