బీజేపీకి అనుబంధ సంస్థగా మారిన ఎన్నికల సంఘం
Actor ProfilePolitician

బీజేపీకి అనుబంధ సంస్థగా మారిన ఎన్నికల సంఘం

📊 Box Office Collections
Total News2
Movie Updates0
Sources1
లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ టౌన్ ప్లానింగ్ సూపర్ వైజర్
Andhra Jyothy11 Jan 2027
లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ టౌన్ ప్లానింగ్ సూపర్ వైజర్

హైదరాబాద్‌లోని పూల్‌బాగ్‌లో జీహెచ్ఎంసీ కార్యాలయంలో అవినీతిపై ఏసీబీకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ఆ కార్యాలయంలో ఏసీబీ ఆధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్, ఆగస్టు18

బీజేపీకి అనుబంధ సంస్థగా మారిన ఎన్నికల సంఘం
Andhra Jyothy10 Jan 2027
బీజేపీకి అనుబంధ సంస్థగా మారిన ఎన్నికల సంఘం

2014లో కొలువుదీరిన నాటి నుంచి రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తుందంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. ఎన్నికల కమిషన్‌ కూడా బీజేపీకి అనుబంధ సంస్థగా మారిందని విమర్శించారు. హైదరాబాద్, ఆగస్టు18: 2014లో కొలువుదీరిన నాటి నుంచి రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తుందంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. ఎన్నికల కమిషన్‌ కూడా బీజేపీకి అనుబంధ సంస్థగా మారిందని విమర్శించారు. మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. తాము ప్రతి ఓటు హక్కు కాపాడాలని చూస్తున్నామని అన్నారు. ఎన్నికల సంఘం గైడ్‌లైన్స్‌తో చాలా నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈసీ ఉదాసీనంగా చూడటం కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డారు. తెలంగాణ 3.38 కోట్ల ఓట్లు ఉన్నాయని గుర్తు చేశారు. ఎఎస్‌బీడీల పేరుతో 22 శాతం ఓట్లు తొలగించారని చెప్పారు. ఓట్ల తొలగింపునకు ప్రధాని మోదీతోపాటు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా బాధ్యత వహించాలని అన్నారు. పేద ప్రజల ఓట్లు తొలగిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ బీఎల్ఏలను 35 వేల మందిని నియమించిందని తెలిపారు. కానీ ఈసీ మాత్రం13,100 మందిని ఇచ్చినట్లు చూపిస్తుందని చెప్పారు. సామాన్యుడి ఓటు తొలగించే ప్రయత్నం చేస్తున్నారంటూ ఈ సందర్భంగా ఈసీపై నిప్పులు చెరిగారు. 2002లో ఓటు వేసి ఉండాలని కండిషన్‌తో చాలా మంది ఎనుమరేషన్ పామ్స్ ఇవ్వలేక పోయారని చెప్పుకొచ్చారు. దీంతో వారిని కూడా ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తున్నారని వివరించారు. అన్ మ్యాపుడ్ ఓట్లు 32,37000 ఉన్నాయని అన్నారు. అలాగే 60,50,000 ఓట్లు సందేహంగా ఉన్నాయని చూపిస్తున్నారని పేర్కొన్నారు. దాంతో 92 లక్షల ఓట్లు ప్రశ్నార్ధకంగా మారాయని ఆవేదనతో అన్నారు. 1.60 కోట్ల ఓట్లు ఎందుకు క్వచ్చన్ మార్క్ పెట్టారో చెప్పాలంటూ ఈసీని తెలంగాణ పీసీసీ చీఫ్ డిమాండ్ చేశారు. దేశంలో ఓటు హక్కును తొలగించే