
తప్పుడు ఆర్థిక సమాచారంతో రూ.24 కోట్ల రుణం ఏకంగా డొల్ల సంస్థల ద్వారా సొమ్ము మళ్లింపు ఈనాడు, అమరావతి అంతా కుమ్మక్కయి... తప్పుడు ఆర్థిక సమాచారంతో స్టాక్‌ను పెంచి చూపించారు. కీలక అంశాలను దాచిపెట్టి యూబీఐ నుంచి మోసపూరితంగా రుణం పొందారు. అనంతరం డొల్ల సంస్థల ద్వారా రుణాన్ని మళ్లించి బ్యాంకుకు భారీ నష్టాన్ని కలగజేశారు. విజయవాడలో వెలుగుచూసిన ఈ కార్పొరేట్ మోసంపై సీబీఐ కేసు నమోదు చేసింది. యూబీఐ ఏజీఎం శ్రీకాంత పాత్రో ఫిర్యాదుతో ఓంకార విజయలక్ష్మి స్ట్రిప్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఏ1), డైరెక్టర్లు కోట భానుప్రసాద్ (ఏ2), కోట శ్రావణి (ఏ3), కోట పృథ్వీ వెంకటతేజ (ఏ4), కోట రాహుల్ సాయిబాలాజీ (ఏ5)తోపాటు గుర్తుతెలియని ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ వ్యక్తులను సీబీఐ నిందితులుగా చేర్చింది. ఓంకార విజయలక్ష్మి స్ట్రిప్స్ ప్రైవేట్ లిమిటెడ్ 2017లో ఏర్పాటైంది. గాల్వనైజ్డ్ పైపులు, ఇతర ఉక్కు ఉత్పత్తులను తయారు చేస్తుంది. 2024లో కంపెనీ డైరెక్టర్లు కోట భానుప్రసాద్, కోట శ్రావణి, కోట పృథ్వీ వెంకటతేజ, కోట రాహుల్ సాయిబాలాజీ తప్పుడు ఆర్థిక నివేదికలు, ఇతర పత్రాలతో సూర్యారావుపేటలో యూబీఐ శాఖను సంప్రదించారు. గతంలో కరూర్ వైశ్యా బ్యాంకులో తీసుకున్న రుణాన్ని యూబీఐకి బదిలీ చేసుకున్నారు. వీరిచ్చిన దరఖాస్తులు, పత్రాల ఆధారంగా యూబీఐ.. 2024 ఫిబ్రవరిలో రూ.24 కోట్ల రుణం ఇచ్చింది. దీనికిహామీగా సరకు, ప్లాంట్, యంత్రాలను పెట్టారు. 2025 మే 17న రుణం రెన్యువల్ చేశారు. యూనిట్‌ను తనిఖీ చేయగా.. గణనీయ తేడా కనిపించింది. రూ.23.85 కోట్ల సరకుకు.. రూ.25 లక్షల విలువైన నిల్వలే ఉన్నాయి. స్టాక్ ఆడిట్‌లోనూ తేడాలను గుర్తించారు. టాటా క్యాపిటల్ ఫైనాన్స్ సర్వీసెస్ నుంచి తీసుకున్న రూ.2.10 కోట్ల రుణాన్ని కూడా వెల్లడించకుండా దాచిపెట్టారు. రుణం మంజూరైన తేదీ నుంచి ఆరు నెలల్లోనే ఇద్దరు డైరెక్టర్లు రాజీనామా చేశారు. యాజమాన్య మార్పుపై ముందస్తు అనుమతి పొందలేదు. ఆ ఇద్దరు డైరెక్టర్లు మెస్సర్స్ నెర్రో