బేగంబజార్ లో స్వాతంత్ర్య సంబరాలు.. సందడి చేసిన సోనూసూద్
Actor ProfileActor

బేగంబజార్ లో స్వాతంత్ర్య సంబరాలు.. సందడి చేసిన సోనూసూద్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
బేగంబజార్ లో స్వాతంత్ర్య సంబరాలు.. సందడి చేసిన సోనూసూద్
AP7AM25 Dec 2026
బేగంబజార్ లో స్వాతంత్ర్య సంబరాలు.. సందడి చేసిన సోనూసూద్

హైదరాబాద్‌లోని ప్రముఖ వ్యాపార కేంద్రమైన బేగంబజార్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో ప్రముఖ సినీ నటుడు సోనూసూద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బేగంబజార్‌లోని ‘భగత్ సింగ్ యువ సేన’ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన సోనూసూద్, బేగంబజార్ ఛత్రి వద్ద జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం యువతతో కలిసి నిర్వహించిన భారీ తిరంగ ర్యాలీలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటూ సమాజ సేవలో నిరంతరం ముందుండే సోనూసూద్, ఇలాంటి జాతీయ పండుగ వాతావరణంలో తమ మధ్య పాల్గొని యువతలో దేశభక్తి స్ఫూర్తిని నింపడం పట్ల స్థానిక ప్రజలు, వ్యాపారులు హర్షం వ్యక్తం చేశారు