బిగ్ అలర్ట్.. ఈనెల 24నుంచి ఆటో
Actor ProfilePolitician

బిగ్ అలర్ట్.. ఈనెల 24నుంచి ఆటో

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
బిగ్ అలర్ట్.. ఈనెల 24నుంచి ఆటో, క్యాబ్ లు బంద్.. డిమాండ్లు ఇవే
10TV Telugu19 Dec 2026
బిగ్ అలర్ట్.. ఈనెల 24నుంచి ఆటో, క్యాబ్ లు బంద్.. డిమాండ్లు ఇవే

Autos and Cabs Strike : తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్ డ్రైవర్లు బంద్‌కు పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ ఈనెల 23వ తేదీ అర్ధరాత్రి నుంచి బంద్ చేస్తున్నట్లు కార్మిక సంఘాల నేతలు ప్రకటించారు. ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ సర్కార్ అమలు చేయాలని కోరుతూ.. ఈనెల 23వ తేదీ అర్ధరాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆటో, క్యాబ్, వ్యాన్ డ్రైవర్లు నిరవధిక బంద్‌ను తలపెట్టినట్లు కార్మిక సంఘాల నేతలు ప్రకటించారు. రాష్ట్ర ఆటో, యాప్ ఆధారిత సంఘాల ఐకాస ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య కళానిలయంలో జరిగిన ఆటో, క్యాబ్, వ్యాన్ డ్రైవర్ల సమావేశంలో 17 కార్మిక సంఘాల నేతలు పాల్గొన్నారు. ఐకాస కన్వీనర్ బి. వెంక టేశం మాట్లాడుతూ.. ఆటో, రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ఆటో మీటరు ఛార్జీలనూ పెంచాలని, తెలంగాణ ప్రభుత్వం ఓలా, ఉబర్, ర్యాపిడోలకు బదులుగా కొత్త యాప్‌ను తీసుకురావాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఆటో డ్రైవర్లకు ఇస్తామన్న రూ.12,000 పథకం అమలు పైనా ప్రభుత్వం దృష్టి సారించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి సత్వర స్పందన రాకుంటే ముఖ్యమంత్రి నివాసంతో పాటు అసెంబ్లీ, ప్రజాభవన్ ముట్టడి కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. లక్షల ఆటోలతో హైదరాబాద్ దిగ్బంధం చేస్తామని అన్నారు. రాష్ట్రంలో ఆర్టీసీ, కార్పొరేట్‌ సంస్థలకు ఈవీ ఆటోలు అందించే ప్రతిపాదననను వెంటనే నిలిపివేయాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో దాదాపు 7.5 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉన్నారని.. హైదరాబాద్‌లో సుమారు 2.5 లక్షల మంది ఉన్నారన్నారు. తమ సమస్యలు పరిష్కరించేంత వరుకు ఉద్యమం కొనసాగతుందున్నారు. సమస్యల పరిష్కారం కోసం ఈనెల 23 అర్ధరాత్రి నుంచి ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్ డ్రైవర్లు బంద్‌కు పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది. మరి తెలంగాణ

బ గ అలర ట ఈన ల 24న చ ఆట Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in