
దేశీయ మార్కెట్‌లో పసిడి ప్రియులకు ఊరట లభించట్లేదు. బంగారం ధరలు నేడు కూడా పెరిగాయి. బుధవారం నాటితో పోల్చుకుంటే స్వల్పంగా పెరుగుదలను నమోదు చేశాయి. రానున్న పండుగలు, వివాహాల సీజన్ తరుణంలో ఈ ధరల పెరుగుదల


దేశీయ మార్కెట్‌లో పసిడి ప్రియులకు ఊరట లభించట్లేదు. బంగారం ధరలు నేడు కూడా పెరిగాయి. బుధవారం నాటితో పోల్చుకుంటే స్వల్పంగా పెరుగుదలను నమోదు చేశాయి. రానున్న పండుగలు, వివాహాల సీజన్ తరుణంలో ఈ ధరల పెరుగుదల

కర్ణాటకలో నేడు రాష్ట్రవ్యాప్త బంద్ కొనసాగుతోంది. కర్ణాటక జాయింట్ యాక్షన్ కమిటీ.. కన్నడ ఒక్కూట ఈ బంద్ కు పిలుపునిచ్చింది. బెంగళూరు సహా చాలాచోట్ల బంద్ ప్రభావం పాక్షికంగా కనిపించింది. మరి కొన్ని చోట్ల సంపూర్ణంగా కొనసాగుతోంది. ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యా సంస్థలు యథాతథంగా పని చేస్తోన్నాయి. బెంగళూరులో బీఎంటీసీ బస్సుల రాకపోకలపైనా పెద్దగా ప్రభావం పడలేదు.తమిళనాడుకు కావేరీ జలాలను విడుదల చేయడాన్ని నిరసిస్తూ కన్నడ హక్కుల పరిరక్షణ వేదిక నేత వాటాల్ నాగరాజ్ ఈ బంద్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. కావేరీ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా కిందటి నెల 28వ తేదీ నుంచి కర్ణాటక ప్రభుత్వం రోజూ 3,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తోంది. ఇప్పటికే వర్షాభావ పరిస్థితులు నెలకొన్న పరిస్థితుల్లో ఇంత పెద్ద మొత్తంలో నీటిని విడుదల చేయడం పట్ల కర్ణాటక హక్కుల పరిరక్షణ వేదిక అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.దీనికి నిరసనగా బంద్ కు పిలుపునిచ్చింది. ఈ తెల్లవారు జామున 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు బంద్ కొనసాగాల్సి ఉంది. కావేరి నదీ పరీవాహక ప్రాంత జిల్లాలు.. మండ్య, మైసూరు, చామరాజనగర, మడికెర్రి, హాసన్ లల్లో సానుకూల స్పందన లభించింది. బంద్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. పలుచోట్ల కేఎస్ఆర్టీసీ బస్సుల రాకపోకలు స్తంభించాయి. బస్సుల రాకపోకలను అడ్డుకున్నారు. బస్సులు డిపోల నుంచి బయటికి రాకుండా ఉద్యమకారులు రోడ్లపై బైఠాయించారు. తమిళనాడుకు కావేరీ నీటి విడుదలను వెంటనే నిలిపివేయాలంటూ నినదించారు.డొనాల్డ్ ట్రంప్ టీమ్ లో బిగ్ వికెట్ డౌన్బెంగళూరులో బంద్ ప్రభావం అంతంత మాత్రమే. ఆటో, క్యాబ్ యూనియన్లు పెద్దగా స్పందించట్లేదు. ఫలితంగా ఆటోలు, క్యాబ్ లు రాకపోకలు యధాతథంగా కొనసాగుతున్నాయి. వాటి సర్వీసులు అందుబాటులో ఉంటోన్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఎప్పట్లాగే పని చేస్తోన్నాయి. బంద్ ప్రారంభమైనప్పటికీ వాహనాల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. జనజీవనానికి ఎలాంటి ఆటంకం కలగలేదు.అమరావతిలో మొదటి