బాక్సాఫీసు వద్ద కొరియన్ కనకరాజు రచ్చ.. వరుణ్ తేజ్ మూవీ 3 రోజుల వసూళ్లు
Actor ProfileActor

బాక్సాఫీసు వద్ద కొరియన్ కనకరాజు రచ్చ.. వరుణ్ తేజ్ మూవీ 3 రోజుల వసూళ్లు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
బాక్సాఫీసు వద్ద కొరియన్ కనకరాజు రచ్చ.. వరుణ్ తేజ్ మూవీ 3 రోజుల వసూళ్లు
Asianet News Telugu24 Nov 2026
బాక్సాఫీసు వద్ద కొరియన్ కనకరాజు రచ్చ.. వరుణ్ తేజ్ మూవీ 3 రోజుల వసూళ్లు

మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌ కి ఎట్టకేలకు హిట్‌ పడింది. ఆయన తాజాగా `కొరియన్‌ కనకరాజు` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. గత శుక్రవారం(ఆగస్ట్ 7)న ఈ చిత్రం విడుదలైంది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో రితిక నాయక్‌ హీరోయిన్‌గా నటించగా, సత్య, మురళీధర్‌ గౌడ్‌, సునీల్‌ కీలక పాత్రలు పోషించారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్‌ ఎంటర్ టైన్‌మెంట్స్ పతాకాలపై తెరకెక్కిన చిత్రమిది. ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్‌ని తెచ్చుకున్న ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద దుమ్మురేపుతోంది. మూడు రోజుల్లోనే అదిరిపోయే వసూళ్లని రాబట్టింది. వరుణ్‌ తేజ్‌కి హిట్‌ లేక చాలా రోజులవుతుంది. దీంతో ఆ లోటుని ఇప్పుడు `కొరియన్‌ కనకరాజు` తీర్చింది. ఎట్టకేలకు వరుణ్‌ తేజ్‌కి హిట్‌ పడింది. ఈ సినిమా మూడు రోజుల్లో మంచి వసూళ్లని రాబట్టింది. మొత్తంగా ఇది రూ.35కోట్లు రాబట్టినట్టు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. రెండు రోజుల్లోనే దీనికి రూ.23.6కోట్లు రాగా, మూడో రోజు దాదాపు రూ.13కోట్లు వసూలు చేయడం విశేషం. గత రెండు రోజులతో పోల్చితే ఆదివారం దీనికి కలెక్షన్లు పెరిగాయి. సండే ఈ మూవీ బాక్సాఫీసు వద్ద ర్యాంపేజ్‌ ఆడిందని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే ఈ సినిమాకి మూడు రోజుల్లో సుమారు ఇరవై కోట్లు రాబట్టినట్టు ట్రేడ్‌ సైట్లు వెల్లడించడం గమనార్హం. ఇక `కొరియన్‌ కనకరాజు` చిత్రానికి సుమారు రూ.40కోట్ల థియేట్రికల్ బిజినెస్‌ జరిగిందని సమాచారం. ఇప్పటి వరకు రూ.35కోట్లు రావడంతో ఇప్పటికే ఇది బ్రేక్‌ ఈవెన్‌ అయినట్టు టీమ్‌ వెల్లడించింది. మొదటి వీకెండ్‌లోనే బ్రేక్‌ ఈవెన్‌ కావడం విశేషమనే చెప్పొచ్చు. ఇటీవల కాలంలో ఇలా తొలి వారాంతంలోనే సినిమా బ్రేక్‌ ఈవెన్‌ కావడం అరుదైన రికార్డుగా చెప్పొచ్చు. అంతేకాదు సోమవారం అడ్వాన్స్ బుకింగ్స్ కూడా సాలిడ్‌గానే ఉన్నట్టు టీమ్‌ చెప్పింది. ఇది సినిమా బ్లాక్‌ బస్టర్ దిశగా వెళ్తుందనే దానికి నిదర్శనంగా చెప్పొచ్చు. మొత్తంగా కొరియన్‌ కనకరాజు

బ క స ఫ స వద ద క ర యన కనకర జ రచ చ వర ణ త జ మ వ 3 ర జ ల వస ళ ల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in