బాక్సాఫీస్ వద్ద అఖిల్ క్లీన్ హిట్.. ఆర్జీవీ స్పెషల్ ట్వీట్ వైరల్
Actor ProfileActor

బాక్సాఫీస్ వద్ద అఖిల్ క్లీన్ హిట్.. ఆర్జీవీ స్పెషల్ ట్వీట్ వైరల్

📊 Box Office Collections
Total News2
Movie Updates0
Sources1
నా కో స్టార్ట్స్ లో అతనొక్కడే సింగిల్.. సిగ్గుపడుతూ మనసులో మాట చెప్పిన భాగ్యశ్రీ
Samayam Telugu26 Oct 2026
నా కో స్టార్ట్స్ లో అతనొక్కడే సింగిల్.. సిగ్గుపడుతూ మనసులో మాట చెప్పిన భాగ్యశ్రీ

టాలీవుడ్‌లో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా దూసుకుపోతోంది భాగ్యశ్రీ బోర్సే . రవితేజ సరసన ‘మిస్టర్ బచ్చన్’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ, ఆ సినిమా ఫలితంతో సంబంధం లేకుండా తన గ్లామర్

బాక్సాఫీస్ వద్ద అఖిల్ క్లీన్ హిట్.. ఆర్జీవీ స్పెషల్ ట్వీట్ వైరల్
Samayam Telugu25 Oct 2026
బాక్సాఫీస్ వద్ద అఖిల్ క్లీన్ హిట్.. ఆర్జీవీ స్పెషల్ ట్వీట్ వైరల్

అక్కినేని యువ హీరో అఖిల్ ఎట్టకేలకు తన కెరీర్‌లో ఒక సాలిడ్ బ్లాక్‌బస్టర్‌ను ఖాతాలో వేసుకున్నారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం 'లెనిన్' ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై, మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ముఖ్యంగా మాస్ ప్రేక్షకులను ఈ చిత్రం విపరీతంగా ఆకట్టుకుంటోంది. క్లాస్ ఇమేజ్ ఉన్న అఖిల్, ఈ సినిమాతో పక్కా మాస్ యాక్షన్ హీరోగా తనను తాను సరికొత్తగా ఆవిష్కరించుకున్నారని విమర్శకులు, ప్రేక్షకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. చిత్రంలో వచ్చే ఇంటర్వెల్ బ్యాంగ్, హై-వోల్టేజ్ క్లైమాక్స్ సీన్లు థియేటర్లలో ఈలలు వేయిస్తున్నాయి.* ఆస్పత్రి ఆవరణలో అనాథలా... దయనీయ స్థితిలో పావలా శ్యామల ఆర్జీవీ ట్వీట్ హల్‌చల్'లెనిన్' చిత్రం సాధించిన భారీ విజయంపై టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. అఖిల్ అక్కినేనిని ట్యాగ్ చేస్తూ.. హే అఖిల్ ‘లెనిన్‌’తో బ్లాక్‌బస్టర్ అందుకున్నందుకు బిగ్ కంగ్రాట్స్’ అంటూ వర్మ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై విపరీతంగా ట్రెండ్ అవుతోంది. అక్కినేని కుటుంబంతో, ముఖ్యంగా కింగ్ నాగార్జునతో ఆర్జీవీకి ఉన్న అనుబంధం ప్రత్యేకమైనది. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'శివ' చిత్రం టాలీవుడ్ యాక్షన్ సినిమాల చరిత్రను తిరగరాసి, ఒక కల్ట్ క్లాసిక్‌గా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే నాగార్జున వారసుడు అఖిల్ సాధించిన మాస్ బ్లాక్‌బస్టర్‌ను ఆర్జీవీ ఇలా ప్రత్యేకంగా అభినందించడం అక్కినేని అభిమానుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ ట్వీట్ చిత్ర ప్రమోషన్లకు మరింత బూస్ట్‌ను ఇచ్చింది.ఎమోషనల్ సక్సెస్ మీట్సినిమాకు అన్ని వైపుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుండటంతో, చిత్ర యూనిట్ హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో గ్రాండ్‌గా సక్సెస్ వేడుకలను నిర్వహించింది. దివంగత లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం సాక్షిగా ఈ సంబరాలు జరిగాయి. ఈ వేడుకకు కింగ్ నాగార్జున ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చిత్ర దర్శకుడు మురళీ కిషోర్, నిర్మాత సూర్యదేవర నాగవంశీలతో కలిసి నాగార్జున, అఖిల్‌లు