బాక్సాఫీస్ పోరులో సాహో’ జోడీ.. విన్నర్ ఎవరు
Actor ProfileActor

బాక్సాఫీస్ పోరులో సాహో’ జోడీ.. విన్నర్ ఎవరు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
బాక్సాఫీస్ పోరులో సాహో’ జోడీ.. విన్నర్ ఎవరు
Chitrajyothy11 Dec 2026
బాక్సాఫీస్ పోరులో సాహో’ జోడీ.. విన్నర్ ఎవరు

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్.. బాక్సాఫీస్ దగ్గర కనిపిస్తే రికార్డులు తిరగబడాల్సిందే. ప్రస్తుతం ఆయన నటిస్తోన్ మోస్ట్ అవైటెడ్ అండ్ క్రేజియెస్ట్ ప్రాజెక్ట్ ‘ఫౌజీ’. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas).. బాక్సాఫీస్ దగ్గర కనిపిస్తే రికార్డులు తిరగబడాల్సిందే. ప్రస్తుతం ఆయన నటిస్తోన్ మోస్ట్ అవైటెడ్ అండ్ క్రేజియెస్ట్ ప్రాజెక్ట్ ‘ఫౌజీ’ (Fauzi). ‘సీతారామం’ వంటి బ్లాక్ బస్టర్ కావ్యంతో క్లాసిక్ హిట్ అందించిన దర్శకుడు హను రాఘవపూడి (Hanu Raghavapudi) ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.1970ల నాటి యుద్ధ నేపథ్యంలో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన సోషల్ మీడియా సెన్సేషన్, డ్యాన్స్ క్వీన్ ఇమాన్వి హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇస్తోంది. అంతేకాకుండా.. మిథున్ చక్రవర్తి, జయప్రద, అనుపమ్ ఖేర్, చైత్ర జె. ఆచార్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్‌తో విజువల్ వండర్‌గా నిర్మిస్తోన్న ఈ చిత్రం డిసెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే.. ఇప్పుడు ప్రభాస్ ‘ఫౌజీ’కి బాక్సాఫీస్ దగ్గర పోటీగా ఒక క్రేజీ సినిమా నిలబడబోతోంది. ఆ సినిమా మరేదో కాదు.. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ నటిస్తున్న ‘ఈఠ’ (Eetha). ప్రభాస్ - శ్రద్ధా కపూర్ (Shraddha Kapoor) కాంబినేషన్‌లో వచ్చిన ‘సాహో’ (Sahoo) సినిమా ఎంతటి హైప్ క్రియేట్ చేసిందో తెలియంది కాదు. బాక్సాఫీస్ దగ్గర ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేకపోయినా.. వీరిద్దరి కెమిస్ట్రీ, జోడీ మాత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు అదే ‘సాహో’ జోడీ బాక్సాఫీస్ దగ్గర ముఖాముఖి తలపడటానికి సిద్ధమైంది. ప్రస్తుతం శ్రద్ధా కపూర్ నటిస్తోన్న ‘ఈఠ’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగంగా జరుపుకుంటోంది. నిజానికి ఈ చిత్రాన్ని ముందుగా ఆగస్ట్ 14న