బాక్సాఫీసు దుమ్ము దులిపేస్తున్న అఖిల్ .. మూడో రోజు లెనిన్ కి షాకింగ్ కలెక్షన్లు
Actor ProfileActor

బాక్సాఫీసు దుమ్ము దులిపేస్తున్న అఖిల్ .. మూడో రోజు లెనిన్ కి షాకింగ్ కలెక్షన్లు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
బాక్సాఫీసు దుమ్ము దులిపేస్తున్న అఖిల్ .. మూడో రోజు లెనిన్ కి షాకింగ్ కలెక్షన్లు
Asianet News Telugu5 Nov 2026
బాక్సాఫీసు దుమ్ము దులిపేస్తున్న అఖిల్ .. మూడో రోజు లెనిన్ కి షాకింగ్ కలెక్షన్లు

అక్కినేని నట వారసుల్లో నాగచైతన్య హీరోగా నిరూపించుకున్నాడు. మంచి విజయాలు అందుకుంటూ రాణిస్తున్నాడు. ఆయన కెరీర్‌లో బ్లాక్‌బస్టర్స్ చాలానే ఉన్నాయి. అయితే నాగార్జున రెండో కొడుకు అఖిల్‌కి మాత్రం హిట్‌ రాలేదు. కెరీర్‌ పరంగా బ్రేక్‌ ఇచ్చే చిత్రం రాలేదు. ఆ లోటుని ఇప్పుడు `లెనిన్‌` తీర్చబోతుంది. ఈ మూవీకి చాలా వరకు పాజిటివ్‌ టాక్‌ వస్తోంది. కలెక్షన్ల పరంగానూ ఇది దుమ్ములేపుతోంది. ఊహించని విధంగా వసూళ్లని రాబట్టడం విశేషం. లెనిన్‌ మూవీ తొలి వీకెండ్‌ని పూర్తి చేసుకుంది. శుక్రవారం విడుదలైన ఈ చిత్రానికి మూడు రోజుల్లో ఎంత కలెక్షన్లు వచ్చాయనేది చూస్తే, ఆశ్చర్యకరమైన వసూళ్లని సాధించింది. మూడు రోజుల్లోనే సగం కలెక్షన్లని రాబట్టడం విశేషం. తొలి వీకెండ్‌లో ఈ మూవీ రూ.37.07కోట్లు(సాక్నిల్క్ సైట్‌ ప్రకారం) సాధించింది. మూడో రోజు(శనివారం) రూ.9.65కోట్లు వసూలు చేసింది. అలాగే ఓవర్సీస్‌లో ఇది రెండు కోట్లు రాబట్టింది. ఓవరాల్ గా మూడో రోజు దీనికి రూ.11.65కోట్లు వచ్చాయి. శనివారంతో పోల్చితే ఆదివారం కలెక్షన్లు పెరగడం విశేషం. ఇక `లెనిన్‌` మూవీ ఇండియాలో మూడు రోజుల్లో రూ.29.27కోట్ల గ్రాస్‌, రూ.25.45కోట్ల నెట్‌ కలెక్షన్లని రాబట్టింది. ఓవర్సీస్‌లో ఇప్పటి వరకు రూ.7.80కోట్లు రాబట్టడం విశేషం. సోమవారం బుకింగ్స్ ఈ చిత్రానికి బాగానే ఉన్నాయి. అయితే ఈ రోజు ఎంత రాబడుతుందనేది ఆసక్తికరంగా మారింది. వీక్‌ డేస్‌లో ఈ మూవీ సత్తా చాటేదాన్ని బట్టి `లెనిన్‌` భవిష్యత్‌ ఆధారపడి ఉంటుంది. ఇదిలా ఉంటే ఈ మూవీ రెండు రోజుల్లోనే రూ.37కోట్లు సాధించినట్టు చిత్ర బృందం వెల్లడించింది. టీమ్‌ చెప్పే లెక్కల ప్రకారం ఇది మూడు రోజుల్లో యాభై కోట్లకు చేరే అవకాశం ఉంది. అంటే ఈజీగా బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌ లో సగం రికవరీ చేస్తుందని చెప్పొచ్చు. `లెనిన్‌` సినిమాకి అయిన బడ్జెట్‌ రూ.40కోట్లు అని సమాచారం. నాన్‌ థియేట్రికల్‌ ఓటీటీ, శాటిలైట్‌ రైట్స్ జీ వాళ్లు తీసుకున్నారు. దీని రూపంలో దాదాపు