
సర్ సర్వేలో పరిస్థితే తిరిగి తలెత్తవచ్చని రాజకీయ పార్టీల ఆందోళన గందరగోళంలో ముసాయిదా జాబితాలోని ఓటర్లు ఈనాడు, హైదరాబాద్: సర్‌లో భాగంగా పోలింగ్ బూత్ అధికారి(బీఎల్‌వో) ఇంటికి వచ్చి నోటీసులు అందిస్తూ ఫొటో దిగే వరకు ఓటర్లలో అయోమయ పరిస్థితి అలాగే ఉండనుంది. నోటీసులు అందుకునే ఓటర్ల వివరాలను పబ్లిక్ డోమైన్‌లో పెట్టే ఉద్దేశం ఎన్నికల సంఘం అధికారులకు లేదు. అభ్యంతరాలు లేని జాబితాలో ఏ ఓటర్లు ఉన్నారు? అనామలీస్ ఓటర్లు ఎవరు? సర్-2002తో మ్యాపింగ్ చేయని ఓటర్లు ఎవరు అనే విషయాలు రాజకీయ పార్టీలకు కూడా తెలిసే పరిస్థితి లేకుండా పోయింది. నోటీసు వస్తేనే తాను ఏ జాబితాలో ఉన్నదీ ఓటరుకు తెలుస్తుంది. నెల రోజుల్లో నోటీసు రాకుంటే ఓటు సరిగ్గా ఉన్నట్టు. ఈ పరిస్థితులపై రాజకీయ పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. నోటీసులు అందుకునే ఓటర్ల వివరాలను ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారిని కలిసి ప్రత్యేక జాబితా ఇవ్వాలని విజ్ఞప్తి చేశాయి. ఎన్నికల అధికారులు ఈ విషయం తమ చేతిలో ఏమీ లేదని తేల్చి చెప్పినట్లు సమాచారం. కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ విషయంపై లేఖ రాస్తామని చెప్పినట్లు తెలిసింది. మొత్తం 3.38 కోట్ల మంది ఓటర్లలో 2.64 కోట్ల మంది వివరాలతో ముసాయిదా జాబితాను రూపొందించి ఎన్నికల అధికారులు ఆన్‌లైన్‌లో ఉంచారు. జిల్లాల్లోని ఈఆర్వో, ఏఈఆర్వో, పోలింగ్‌బూత్‌ల వద్ద కూడా ప్రదర్శించారు. సర్ సర్వేలో పలువురు బీఎల్‌వోలు ఓటర్ల వద్దకు వెళ్లి ఎన్యూమరేషన్ పత్రాలను అందించలేదు. ప్రతి ఇంటికి మూడు సార్లు వెళ్లాలన్న నిబంధన చాలా చోట్ల అమలు కాలేదు. వాటిని వారు తమ వద్దే ఉంచుకుని ఏఎస్‌డీడీ జాబితాలో చేర్చారని పార్టీలు ఆరోపించాయి. ఇప్పుడు నోటీసులు ఇవ్వాల్సిన ఓటర్ల వద్దకు బీఎల్‌వోలు వెళ్లకపోతే పరిస్థితి ఏంటనేది సమాధానం దొరకని ప్రశ్నగా మిగిలింది. సోమవారం ఎన్నికల అధికారులు తెలియజేసిన ప్రకారం మొత్తం 92.87 లక్షల