బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే
Actor ProfilePolitician

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే

📊 Box Office Collections
Total News2
Movie Updates0
Sources2
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి షాక్
AP7AM18 Nov 2026
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి షాక్

బీఆర్ఎస్ నేత, తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి హైదరాబాద్ కోర్టులో చుక్కెదురైంది. దాదాపు దశాబ్ద కాలం నాటి చెక్ బౌన్స్ కేసులో ఆయనను దోషిగా నిర్ధారిస్తూ, న్యాయస్థానం నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.ఇంటెల్లిడెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు సంబంధించిన రూ. 34.23 లక్షల చెక్ బౌన్స్ కేసులో ఈ తీర్పు వెలువడింది. 2015లో రోహిత్ రెడ్డి ఆ కంపెనీలో డైరెక్టర్‌గా ఉన్న సమయంలో, సంస్థ వనరులను తన వ్యక్తిగత వ్యాపారాలకు వినియోగించి నష్టం కలిగించారనే ఆరోపణలు వచ్చాయి. ఈ వివాద పరిష్కారానికి ఇరుపక్షాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందంలో భాగంగా 2014 సెప్టెంబర్ 25న రోహిత్ రెడ్డి సదరు సంస్థకు చెక్కును అందజేశారు.అయితే, ఖాతాలో సరిపడా నిధులు లేకపోవడంతో ఆ చెక్ 2014 అక్టోబర్, డిసెంబర్ మధ్య మూడుసార్లు బౌన్స్ అయింది. దీనిపై సంస్థ పంపిన లీగల్ నోటీసులకు రోహిత్ రెడ్డి స్పందించకపోవడంతో వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ కేసుపై సుదీర్ఘ విచారణ జరిపిన హైదరాబాద్ మొదటి జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (మున్సిపల్ కోర్టు), నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ సెక్షన్ 138 కింద రోహిత్ రెడ్డిని దోషిగా నిర్ధారించింది.తీర్పు వెలువడే సమయంలో రోహిత్ రెడ్డి కోర్టుకు హాజరుకాకపోవడంతో న్యాయమూర్తి ఆయనపై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచిన అనంతరం శిక్షాకాలాన్ని ఖరారు చేయనున్నారు

బాల్క సుమన్ అరెస్ట్
TeluguOne30 May 2026
బాల్క సుమన్ అరెస్ట్

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం ఉదయం ఆయన నివాసానికి చేరుకున్న పోలీసులు అదుపులోకి తీసుకుని నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. ఇటీవల

బ ఆర ఎస మ జ ఎమ మ ల య Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in