
బడ్జెట్‌లో ప్రతిపాదించిన అస్సాం ప్రభుత్వం గువాహటి: మహిళా సాధికారతను ప్రోత్సహించడం, స్త్రీ-పురుష సమానత్వాన్ని పెంపొందించడంలో భాగంగా బహుభార్యత్వం నిషేధానికి కీలక చర్యలు తీసుకుంటున్నట్లు అస్సాం ప్రభుత్వం ప్రకటించింది. దీనిలో భాగంగానే ఒకరి కంటే ఎక్కువ మంది మహిళలను వివాహమాడే వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందవని ప్రకటించింది. అలాంటి వారు ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటే ఆ విధుల నుంచి తొలగిస్తామని వెల్లడించింది. శుక్రవారం అసెంబ్లీకి సమర్పించిన రాష్ట్ర బడ్జెట్‌లో ఈ కీలక ప్రతిపాదనలు చేసింది. 2026-27 ఆర్థిక సంవత్సరం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి జయంత మల్లా బారువా అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. నేరాల కేసులో దోషిగా తేలిన వ్యక్తికీ సంక్షేమ పథకాలు అందించబోమని తెలిపారు. బహుభార్యత్వాన్ని నిషేధించే దిశగా గతేడాది నవంబరులో అస్సాం అసెంబ్లీ ఓ బిల్లును ఆమోదించింది. ఆరో షెడ్యూల్‌లోని ప్రాంతాలకు మినహా అస్సాం అంతటా ఈ బిల్లు వర్తిస్తుందని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అప్పట్లో తెలిపారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు