బధిర విద్యార్థులకు డిగ్రీ కోర్సులు ప్రారంభం.. తొలి ఏడాది 30 సీట్లతో బీకాం కంప్యూటర్స్
Actor ProfilePolitician

బధిర విద్యార్థులకు డిగ్రీ కోర్సులు ప్రారంభం.. తొలి ఏడాది 30 సీట్లతో బీకాం కంప్యూటర్స్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
బధిర విద్యార్థులకు డిగ్రీ కోర్సులు ప్రారంభం.. తొలి ఏడాది 30 సీట్లతో బీకాం కంప్యూటర్స్
Samayam Telugu13 Jan 2027
బధిర విద్యార్థులకు డిగ్రీ కోర్సులు ప్రారంభం.. తొలి ఏడాది 30 సీట్లతో బీకాం కంప్యూటర్స్

బధిర విద్యార్థులకు రాష్ట్రంలో తొలిసారిగా డిగ్రీ కళాశాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు బధిర విద్యార్థులకు ఇంటర్మీడియట్ వరకు మాత్రమే మన దగ్గర కోర్సులు ఉన్నాయి. తొలిసారి డిగ్రీ కోర్సులు కూడా బోధించాలని విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. బాపట్ల జిల్లా వెదుళ్లపల్లిలో ఉన్న బధిరుల ఆశ్రమ పాఠశాల, జూనియర్ కళాశాలలోనే ఇకపై డిగ్రీ కళాశాలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు జూలై 22న రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.ఆశ్రమ పాఠశాల, జూనియర్ కళాశాలలోని తాత్కాలిక భవనాల్లోనే ప్రస్తుతం డిగ్రీ కళాశాలను ప్రారంభించారు. తొలి ఏడాది బీకాం కంప్యూటర్ సైన్స్‌లో 30 సీట్లతో ప్రవేశాలకు శ్రీకారం చుడుతున్నారు. ఈ మేరకు అధ్యాపకుల నియామకం, వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నారు. కళాశాల ప్రిన్సిపల్ రజియా మాట్లాడుతూ బీకాం కంప్యూటర్స్‌లో చేరిన విద్యార్థులకు ఉచిత వసతి, భోజన సౌకర్యం, పాఠ్య, రాత పుసక్తాలు, కాస్మొటిక్స్ ఖర్చులకు నగదు, వినికిడి పరకాలు అందజేస్తున్నట్లు ఆమె తెలిపారు.అర్హత ఉన్న బధిర విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపల్ రజియా తెలిపారు. అర్హులు సంబంధిత సర్టిఫికెట్లతో కాలేజీ దగ్గరకు వచ్చి అడ్మిషన్స్ పొందాలని సూచించారు. సందేహాలు ఉంటే 9000013633 నెంబర్‌లో సంప్రదించాలని కోరారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని బధిర విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారి 1987లో అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు బధిరుల కోసం ఆశ్రమ పాఠశాలను ఏర్పాటు చేశారు. 14 ఎకరాల విస్తీర్ణంలో బధిరుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని వెదుళ్లపల్లిలో ఈ పాఠశాలను ఏర్పాటు చేశారు. 1987లో ఎన్టీఆర్ బధిరుల ఆశ్రమ పాఠశాలను ప్రారంభించగా.. 1990లో చంద్రబాబు నాయుడు హయాంలో ఆశ్రమ పాఠశాలకు జూనియర్ కళాశాల హోదా కల్పించారు. మళ్లీ 2026లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే డిగ్రీ కళాశాలగా చేయడం విశేషం. బధిర విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో మరింత ఎత్తుకు ఎదగాలనేదే ప్రభుత్వం ఆకాంక్ష