
శివ్వంపేట: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సునీతారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత మాధవరెడ్డి వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గోమారంలో ఆదివారం బోనాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల విషయంలో వివాదం రాజుకుంది. పోలీసులు ఫ్లెక్సీలు తొలగించి సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. అనంతరం తమపై దాడి చేశారని ఇరు వర్గాల కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు పరస్పరం పోలీసులను ఫిర్యాదు చేశారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు