
ఫిఫా ప్రపంచ కప్ మ్యాచ్‌లో పరాగ్వేపై ఫ్రాన్స్ జట్టు విజయం సాధించినప్పటి నుండి.. ఫ్రాన్స్ కెప్టెన్, స్టార్ స్ట్రైకర్ కిలియన్ ఎంబాప్పే, పరాగ్వే మహిళా సెనేటర్ సెలెస్టే అమరిల్లా మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. బుధవారం పరాగ్వే సెనేట్ వేదికగా ఆమె ఎంబాప్పేను అత్యంత ఘోరమైన బూతు పదంతో దూషించి సరికొత్త వివాదానికి తెరలేపారు. అంతకుముందు ఎంబాప్పే ఆమెను ఉద్దేశించి.. "ఆమె ఒక అసహ్యకరమైన మహిళ, తను ఉన్న పదవికి ఏమాత్రం అర్హురాలు కాదు" అని విమర్శించడమే ఇందుకు కారణం.మ్యాచ్ ముగిసిన తర్వాత పరాగ్వే యువ గోల్‌కీపర్ ఓర్లాండో గిల్ గౌరవంగా కరచాలనం చేయడానికి చేయి చాపగా.. ఎంబాప్పే నిరాకరించి, అతని ముఖంపైనే అరిచాడని అమరిల్లా ఆరోపించారు. ఒక నిజమైన ఫ్రాన్స్ పౌరుడు ఎప్పటికీ అలా చేయడని, ఫ్రాన్స్ సంస్కృతి అంటే రూసో, డెస్కార్టెస్, విక్టర్ హ్యూగో వంటి గొప్ప మేధావుల వారసత్వమని.. అంతటి గొప్ప దేశాన్ని ఎంబాప్పే స్థాయికి తగ్గించలేనని ఆమె వ్యాఖ్యానించారు. అంతకుముందు ఆమె సోషల్ మీడియాలో రాస్తూ.. ఎంబాప్పేను "ఫ్రెంచ్ పౌరుడిగా నటించడానికి ప్రయత్నిస్తున్న ఒక వలసవాద కెమరూనియన్" అని, చదువు రాని మొరటువాడని జాత్యహంకార వ్యాఖ్యలు చేశారు.ఈ వివాదంపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల విభాగం ఆగ్రహం వ్యక్తం చేయగా, ఫ్రాన్స్ ఫుట్‌బాల్ అసోసియేషన్ చట్టపరమైన చర్యలు తీసుకుంది. పరాగ్వే ప్రభుత్వం కూడా ఆమె వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని ప్రకటించింది. దీంతో ఆమె ఆ పోస్టులను తొలగించి, తాను కూడా వివక్షను ఎదుర్కొన్నానని చెబుతూనే.. ఎంబాప్పే తనకు క్షమాపణ