ఫిరంగి కోసం పోరాటం
Actor ProfileCelebrity

ఫిరంగి కోసం పోరాటం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఫిరంగి కోసం పోరాటం
Andhra Jyothy1 Nov 2026
ఫిరంగి కోసం పోరాటం

యూనివర్సిటీల మధ్య సాధారణంగా క్రీడా పోటీలుంటాయి... లేదంటే డ్రామా పోటీలుంటాయి. ర్యాంకులు సాధించడం లోనూ పోటీ పడటం సహజం. కానీ అమెరికాలోని రెండు యూనివర్సిటీల మధ్య ఒక ఫిరంగి కోసం ఏకంగా సుదీర్ఘ పోరాటమే జరిగింది. ‘ఆ ఫిరంగి మాదంటే మాది’ అంటూ విద్యార్థులు ఘర్షణ పడ్డారు. ఇంతకీ దాని ప్రత్యేకత ఏంటి? అమెరికాలో ఉన్న ప్రిన్స్‌టన్‌, రట్జర్‌ యూనివర్సిటీలకు శతాబ్దాల చరిత్ర ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రముఖులు ఈ విశ్వవిద్యాలయాల్లో చదివారు. ఆశ్చర్యం ఏమిటంటే... ఈ రెండు విశ్వవిద్యాలయాల మధ్య ఒక ఫిరంగి వల్ల గొడవ ప్రారంభమైంది. ఆ ఫిరంగి అమెరికా స్వాతంత్య్ర యుద్ధంలో ఉపయోగించినది. భూమిలో పాతిపెట్టారు... నిజానికి ఫిరంగి ఒకటి కాదు, రెండు ఉండేవి. యుద్ధం ముగిసిన తరువాత వాటిని ప్రిన్స్‌టన్‌ క్యాంపస్‌లో ఉంచారు. 1812లో బ్రిటిష్‌ దాడులను ఎదుర్కొనేందుకు పెద్ద ఫిరంగిని తీసుకెళ్లారు. తరువాత ఆ ఫిరంగిని రట్జర్‌ యూనివర్సిటీ క్యాంపస్‌లో పెట్టారు. 24 ఏళ్ల తరువాత తిరిగి దానిని ప్రిన్స్‌టన్‌ యూనివర్సిటీకి తీసుకొస్తున్న సమయంలో వాహనం పాడైంది. దాంతో ఫిరంగిని అక్కడే రోడ్డుపై పెట్టారు. రెండేళ్లపాటు దాన్నెవరూ పట్టించుకోలేదు. ఆ తరువాత 1839లో లియోనార్డ్‌ జెరోమ్‌ అనే వ్యక్తి విద్యార్థులను సమీకరించి... వారి సహాయంతో ఫిరంగిని ప్రిన్స్‌టన్‌ తీసుకొచ్చి, యూనివర్సిటీ ప్రాంగణంలో భూమిలో పాతిపెట్టారు. అలా ఎందుకు పాతిపెట్టారో ఎవ్వరికీ తెలియదు. అయితే కొంతకాలం తరువాత ఫిరంగి తమదని రట్జర్‌ యూనివర్సిటీ విద్యార్థులు వాదించడం మొదలుపెట్టారు. 1875లో రట్జర్‌ యూనివర్సిటీకి చెందిన విద్యార్థుల బృందం ప్రిన్స్‌టన్‌కు చేరుకుని ఫిరంగిని ఎత్తుకెళ్లాలని ప్రయత్నించింది. అయితే భూమిలో పాతిపెట్టి ఉండటంతో కదిలించలేకపోయారు. చేసేదేమి లేక అక్కడే ఉన్న చిన్న ఫిరంగిని పట్టుకెళ్లారు. డాక్యుమెంటరీ... రట్జర్‌ యూనివర్సిటీ విద్యార్థులు ఫిరంగిని పట్టుకెళ్లారనే విషయం అమెరికా అంతటా వ్యాపించింది. రెండు యూనివర్సిటీల అధికారులు లేఖలు రాసుకున్నారు. చివరకు ఒక కమిటీ వివాదాన్ని పరిష్కరించింది. చిన్న ఫిరంగిని తిరిగి ప్రిన్స్‌టన్‌ తీసుకొచ్చారు. అయితే అంతటితో

ఫ ర గ క స ప ర ట Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in