ఫిఫా వివాదం
Actor ProfilePolitician

ఫిఫా వివాదం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఫిఫా వివాదంపై నోరు విప్పిన డొనాల్డ్ ట్రంప్
AP7AM1 Oct 2026
ఫిఫా వివాదంపై నోరు విప్పిన డొనాల్డ్ ట్రంప్

ఫిఫా ప్రపంచకప్‌లో అమెరికా ఆటగాడికి ఇచ్చిన రెడ్ కార్డ్ వ్యవహారంలో తాను జోక్యం చేసుకోవడాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం సమర్థించుకున్నారు. ఆ రెడ్ కార్డ్ నిర్ణయం ఎంతమాత్రం సమర్థనీయం కాదని, టోర్నమెంట్‌లో అత్యుత్తమ ఆటగాళ్లు మైదానంలో ఉండాలనే ఉద్దేశంతోనే తాను కేవలం పునఃసమీక్ష (రివ్యూ) మాత్రమే కోరానని స్పష్టం చేశారు. వైట్‌హౌస్‌లో పిల్లల కోసం 'ట్రంప్ అకౌంట్స్' పథకాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఘటన తర్వాత తాను ఫిఫా అధ్యక్షుడు జియాని ఇన్ఫాంటినోతో మాట్లాడినట్లు ధ్రువీకరించిన ట్రంప్.. ఆ ఆటగాడిపై నిషేధాన్ని రద్దు చేస్తూ ఫిఫా చివరకు సరైన నిర్ణయమే తీసుకుందని అన్నారు."నేను కేవలం రివ్యూ మాత్రమే అడిగాను, ఎందుకంటే అది అసలు ఫౌలే కాదని నేను భావించాను. ఇద్దరు గొప్ప అథ్లెట్లు ఒకరినొకరు ఢీకొట్టుకుని కిందపడ్డారంతే. అంతేగానీ ఒకరి ముఖంపై మరొకరు గుద్దినంత దారుణమేమీ అక్కడ జరగలేదు" అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే, ఈ నిర్ణయాన్ని మార్చాలని తాను ఫిఫాపై ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదని స్పష్టం చేశారు. "ఈ నిర్ణయంతో నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను చేసిందిల్లా రివ్యూ చేయమని అడగటమే" అని పేర్కొన్నారు. ఒక రెడ్ కార్డ్ వల్ల సదరు ఆటగాడు తదుపరి మ్యాచ్‌కు కూడా దూరమవుతాడనే విషయం తెలిసి తాను ఆశ్చర్యపోయానని ట్రంప్ చెప్పారు. "అసలు ఆ రెడ్ కార్డ్ అంటే ఏంటో నాకేం తెలియదు. ఆ రూల్ గురించి తెలిశాక.. జోక్ చేస్తున్నారా? మన బెస్ట్ ప్లేయర్ తర్వాతి మ్యాచ్ ఆడడా? అని

ఫ ఫ వ వ ద Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in