
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ నటి షకీల ఇటీవల తనకు ఎదురైన ఒక భయంకరమైన ఆరోగ్య సమస్య గురించి అభిమానులతో పంచుకున్నారు. అతిగా మొబైల్ ఉపయోగించడం వల్ల తాను తీవ్రమైన మెడ నొప్పితో బాధపడ్డానని, దీనివల్ల రూ.3 లక్షల ఖర్చుతో శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చిందని ఆమె (Shakeela) వెల్లడించారు. ఈ విషయాన్ని తెలుపుతూ అభిమానులకు జాగ్రత్తలు చెప్పారు. ఫోన్‌లో చాలాసేపు గేమ్స్ ఆడటం, యూట్యూబ్, ఇన్‌స్టాలో రీల్స్ చూడటం వల్ల తనకు ఈ పరిస్థితి వచ్చిందని షకీల తెలిపారు. నిద్రపోయే సమయంలో కూడా ఒక పక్కకు వాలి గంటలు గంటలు ఫోన్ చూడటంతో మెడలోని నరాలపై తీవ్ర ప్రభావం పడిందని, అందుకే శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చిందని ఆమె పేర్కొన్నారు (Shakeela Neck Surgery). ‘‘ఫోన్ చాలా ముఖ్యం. కానీ, అవసరానికి మించి దాన్ని వాడకండి. ఉపయోగం లేని వీడియోలను చూస్తూ సమయం వృథా చేయకండి. సరిగ్గా వాడకపోతే రూ.3 లక్షల డబ్బులు పోవడమే కాకుండా, భరించలేని నరకయాతన అనుభవించాల్సి వస్తుంది. చిన్న పిల్లలకు ఫోన్ ఇవ్వడంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మొబైల్ వాడకాన్ని తగ్గించాలి’’ అని షకీల కోరారు. 18 ఏళ్ల వయసులో ‘ప్లే గర్ల్స్’ అనే తమిళ చిత్రంతో షకీల ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. 2000 సంవత్సరంలో వచ్చిన మలయాళ చిత్రం ‘కిన్నార తుంబికల్’ ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది. డైరెక్టర్ తేజ రూపొందించిన ‘జయం’ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత నిజం, బంగారం, తొట్టిగ్యాంగ్ వంటి పలు చిత్రాల్లో ఆమె నటించారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత