ఫిన్ లాండ్ లో విద్యా అధ్యయన పర్యటన.. ఎంపికైన అల్లూరి జిల్లా ఉపాధ్యాయుడు
Actor ProfilePolitician

ఫిన్ లాండ్ లో విద్యా అధ్యయన పర్యటన.. ఎంపికైన అల్లూరి జిల్లా ఉపాధ్యాయుడు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఫిన్ లాండ్ లో విద్యా అధ్యయన పర్యటన.. ఎంపికైన అల్లూరి జిల్లా ఉపాధ్యాయుడు
Eenadu17 Dec 2026
ఫిన్ లాండ్ లో విద్యా అధ్యయన పర్యటన.. ఎంపికైన అల్లూరి జిల్లా ఉపాధ్యాయుడు

పాడేరు: అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం మత్యాపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు చెందిన రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మోష్య సత్యారావు ఫిన్‌లాండ్‌లో జరిగే శిక్షణ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందుకున్నారు. ప్రాథమిక స్థాయిలో అక్షరాస్యత, సంఖ్యాశాస్త్రం, అభ్యాస నైపుణ్యాలను బలోపేతం చేయడానికి ఆగస్టు 17 నుంచి 26వ తేదీ వరకు ఫిన్‌లాండ్‌లోని తుర్కు యూనివర్సిటీలో నిర్వహించనున్న ఎఫ్.ఎల్.ఎన్ శిక్షణా కార్యక్రమంలో సత్యారావు పాల్గొంటారు. మొత్తం 29 మంది రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులు ఈ శిక్షణకు హాజరవుతున్నారు. 2025 సెప్టెంబర్ 5వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మోష్య సత్యారావు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న సంగతి విధితమే. అల్లూరి సీతారామరాజు జిల్లా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన సత్యారావుని జిల్లా విద్యాశాఖ అధికారి, భానుమూర్తి రాజు, ఉప విద్యాశాఖ అధికారి ఎస్ .చెల్లయ్య, మండల విద్యాశాఖ అధికారి కె.ఈశ్వరరావు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

ఫ న ల డ ల వ ద య అధ యయన పర యటన ఎ ప క న అల ల ర జ ల ల ఉప ధ య య డ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in