
పెళ్లంటే పందిళ్లు ... సందళ్లు... తప్పెట్లు... తాళాలు... రెండు మనసుల కలయికే కాదు, జీవితంతం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకాల వేడుక. ఆ జ్ఞాపకాలను పదిలంగా ఉంచి కలకాలం గుర్తుండేలా వాటికి శాశ్వత రూపం ఇచ్చేవి ఫొటోలు, వీడియోలు. ప్రీ వెడ్డింగ్ షూట్‌ల నుంచి పెళ్లిలో బంధువుల సందడి, ఆప్యాయ ఆలింగనాలు, వధువును అత్తారింటికి పంపే తల్లిదండ్రుల కంటతడి వరకు ప్రతి ఆనంద క్షణాలూ భావోద్వేగాలూ కాలగర్భంలో కలిసి పోకుండా అవి పదిలంగా ఉంచుతాయి. అందుకే నేటి పెళ్లి తంతులో ఈ ఖర్చు తప్పని సరైంది. లక్షలకు చేరింది. అయితే వీటి చిత్రీకరణలో పొరపాటు జరిగితే; ఆ జ్ఞాపకాలను సరిగా బంధించకపోతే; ఫొటోలు, వీడియోలు ఆశించిన స్థాయిలో రాకపోతే; ఒప్పందం అమలు చేయకపోతే; మానసిక వేదనే మిగులుతుంది. అయితే ఓ జంట ఇలా వేదనతో సరిపుచ్చుకోలేదు. ఒప్పంద ఉల్లంఘనపై వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించింది. తమ మనో వేదనకు మూల్యం చెల్లించేలా ఆదేశించాలని, ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు పరిహారాన్ని ఇప్పించాలని వేడుకుంది. సేవల్లో లోపంతో పాటు భావోద్వేగాలను ఫోరం అర్థం చేసుకుని తీర్పు వెలువరించింది. కేరళకు చెందిన ఓస్టిన్ ఊమచెన్, కావ్య సంతోష్ ఇద్దరూ వైద్యులు. వీరిద్దరికి పెళ్లి నిశ్చయం అయింది. కొచ్చిలోని పికోలో వెడ్డింగ్స్ సంస్థ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఓ పెళ్లి ఫొటోలు, వీడియోలు చూశారు. తమ వివాహ వేడుకను అలాగే పదిలపరుచుకోవాలని భావించి, ఆ సంస్థను సంప్రదించారు. ఒప్పందం... ఉల్లంఘన... బ్రైడ్ అండ్ గ్రూమ్ సైడ్ ప్యాకేజీని ఆ జంట ఎంచుకుంది. ఆ ప్యాకేజీ కింద అందించే సేవలను సంస్థ వివరించింది. మొత్తం రూ.95 వేలకు వారి మ«ధ్య ఒప్పందం కుదిరింది. రూ.10 వేలు అడ్వాన్స్‌గా, పెళ్లిరోజు మరో రూ. 70 వేలు చెల్లించారు. 2024లో వీరి వివాహం ఘనంగా జరిగింది. అయితే ఒప్పందంలో పేర్కొన్న ప్రకారం డ్రోన్ కెమెరా ద్వారా పెళ్లిని షూట్ చేయలేదు. ఆ విషయాన్ని ముందుగా తెలియజేయలేదు. దీంతో మరొకరిని ఏర్పాటు