ఫుట్ పాత్ ల మీద నిద్ర.. ఆకలి కేకలతో ఏడుపులు..! కట్ చేస్తే ఇండస్ట్రీలో తిరుగులేని నటుడు
Actor ProfileActor

ఫుట్ పాత్ ల మీద నిద్ర.. ఆకలి కేకలతో ఏడుపులు..! కట్ చేస్తే ఇండస్ట్రీలో తిరుగులేని నటుడు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఫుట్ పాత్ ల మీద నిద్ర.. ఆకలి కేకలతో ఏడుపులు..! కట్ చేస్తే ఇండస్ట్రీలో తిరుగులేని నటుడు
TV9 Telugu18 Nov 2026
ఫుట్ పాత్ ల మీద నిద్ర.. ఆకలి కేకలతో ఏడుపులు..! కట్ చేస్తే ఇండస్ట్రీలో తిరుగులేని నటుడు

సినీ పరిశ్రమలో ఎంతోమంది నటులు జీరో నుండి హీరోలుగా ఎదిగారు. వారిలో ఈ దిగ్గజ నటుడు ఒకరు. సినిమాల్లోకి రాకముందు ఎన్నో కష్టాలను అనుభవించాడు. ఆయన జీవిత ప్రయాణం అత్యంత స్ఫూర్తిదాయకం. అన్నం లేక, డబ్బుల్లేక తీవ్ర కష్టాలను ఎదుర్కొని, అడుగడుగునా ఆకలి, నిరాశలను జయించి ఆయన స్టార్‌డమ్‌ను చేరుకున్నాడు. ఈ కష్టాల కడలిని ఈదుకుంటూ ముందుకు సాగిన ఆయన జీవిత కథ అనేకమందికి ఆదర్శం. ఆయన మరెవరో కాదు.. బాలీవుడ్ లెజెండ్రీ యాక్టర్ మిథున్ చక్రవర్తి. నటుడు మిథున్ చక్రవర్తి బాల్యం, యవ్వనం ఎన్నో సవాళ్లతో కూడుకున్నవి. ఒకానొక సమయంలో ఆయనకు కనీసం తినడానికి తిండి, నిద్రపోవడానికి చోటు కూడా దొరకలేదట. “అన్నం దొరకని సమయాల్లో ఖాళీ కడుపుతో రోజులు గడిపాను. ఆకలి కేకలతో నన్ను నేను తిట్టుకుంటూ, ఏడుస్తూ నిద్రపోయాను. నాకు ఎప్పుడు తిండి దొరుకుతుందా.?, నిద్రపోవడానికి కాస్త చోటు దొరికితే బాగుండు అని ఆలోచిస్తూ భారంగా కాలాన్ని నెట్టుకొచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. చాలాసార్లు నేను ఫుట్‌పాత్‌ల మీద నిద్రపోయాను” అని ఆయన తన గతాన్ని గుర్తుచేసుకున్నారు. కేవలం జీవనోపాధి కోసమే పనిచేయాల్సి వచ్చిన సందర్భాలు కూడా ఆయన జీవితంలో ఉన్నాయి. నాలుగు మెతుకుల కోసం పార్టీల్లో డ్యాన్స్ చేసేవాడినని, మంచి డ్యాన్స్ చేయగలిగే విలన్‌గానైనా అవకాశం దొరికితే బాగుంటుందని ఆశించేవాడినని మిథున్ చక్రవర్తి వివరించారు. ఇలాంటి తీవ్రమైన కష్టాల మధ్య, భవిష్యత్తుపై నమ్మకం సన్నగిల్లి, మిథున్ చక్రవర్తి ఒకానొక సమయంలో తన ప్రాణాలే తీసుకోవాలని ఆలోచించారు. తాననుకున్నది సాధించలేనేమో అన్న భయం, కలకత్తాకు తిరిగి వెళ్లలేని పరిస్థితి ఆయన్ను ఆ ఆలోచనకు పురిగొల్పాయి. అయితే, తన జీవితంలో ఎదుర్కొన్న ఈ చీకటి రోజులను గుర్తుచేసుకుంటూ, అందరికీ ఒక విలువైన సలహా ఇచ్చారు. “ఎవరూ జీవితాన్ని ముగించాలనుకోకండి. పోరాడండి. నేను ఫైట్ చేశాను. ఇదిగో ఇప్పుడు ఈ స్థానంలో ఉన్నాను” అని చెప్పుకొచ్చారు. మిథున్ చక్రవర్తి సినీ ప్రస్థానం 1976లో

ఫ ట ప త ల మ ద న ద ర ఆకల క కలత ఏడ ప ల కట చ స త ఇ డస ట ర ల త ర గ ల న నట డ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in