
ఉత్తరప్రదేశ్‌లో అధికార బీజేపీకి చెందిన ఓ శాసనసభ్యుడు దారుణంగా మోసపోయారు. సేవతా నియోజకవర్గ ఎమ్మెల్యే జ్ఞాన్ తివారీ అల్లుడు.. ఓ అంతర్రాష్ట్ర ఘరానా మోసగాడని, దేశవ్యాప్తంగా నకిలీ గుర్తింపులతో ఏకంగా 25 పెళ్లిళ్లు చేసుకుని కోట్ల రూపాయలు దండుకున్నాడని తేలింది. ఈ దారుణ మోసంపై ఎమ్మెల్యే ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిందితుడైన అల్లుడు ప్రకార్ త్రివేది, అతడి తండ్రి అనుజ్ త్రివేదిని శనివారం అరెస్ట్ చేశారు.ఎమ్మెల్యే జ్ఞాన్ తివారీ 2024లో తన కుమార్తె ప్రజ్ఞ వివాహాన్ని మిశ్రిఖ్ ప్రాంతానికి చెందిన ప్రకార్ త్రివేదితో అంగరంగ వైభవంగా జరిపించారు. పెళ్లికి ముందు ప్రకార్ తండ్రి అనుజ్ త్రివేది, తమకు ముంబైలో వందల కోట్ల విలువైన రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉందని నమ్మబలికారు. స్థానికంగా కూడా మంచి పేరున్నట్లు చిత్రీకరించడంతో ఎమ్మెల్యే ఈ సంబంధానికి అంగీకరించారు. తమ నేర చరిత్రను, కేసులను త్రివేది కుటుంబం ఆ సమయంలో అత్యంత లౌక్యంగా దాచిపెట్టింది.వివాహమైన రెండేళ్ల తర్వాత అసలు నిజం సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. ప్రకార్ త్రివేది నకిలీ పేర్లు, ఫేక్ ఐడీ కార్డులు వాడుతూ మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో సుమారు 25 మంది యువతులను పెళ్లి చేసుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. పెళ్లి చేసుకున్న తర్వాత వారి కుటుంబాలను మోసం చేసి, కోట్ల రూపాయల డబ్బు, ఆభరణాలతో పరారవడం అతడికి అలవాటని తేలింది.ఈ మోసం గురించి తెలియగానే ఎమ్మెల్యే జ్ఞాన్ తివారీ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆగస్టు 6న తన కుమార్తెతో కలిసి ఓ వీడియోను విడుదల చేశారు