
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Big Relief To Allu Arjun: పుష్ప 2 మూవీ ప్రీమియర్స్ సందర్బంగా జరిగిన తొక్కిసలాటలో ఈ సినిమాలో కథానాయకుడిగా నటించిన అల్లు అర్జున్‌కు నాంపల్లి క్రిమినల్ కోర్టు పెద్ద ఊరటనిచ్చింది. ఈ కేసులో 11వ నిందితుడిగా ఉన్న అల్లు అర్జున్ వర్చువల్‌గా హాజరు కావొచ్చంటూ జడ్జి కాస్త ఊరట నిచ్చారు. తను నిత్యం సినిమాలతో బిజీగా ఉండటం మూలాన ఈ కేసుకు సంబంధించి కోర్టుకు వర్చువల్‌గా హాజరవుతానంటూ కోర్టుకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. అంతేకాదు తాను కోర్టు హాజరు అయితే.. సెక్యురిటీ సహా ఇతరుకు అసౌర్యం కలిగే అవకాశాలున్నాయని తెలిపారు. బన్ని రిక్వెస్ట్‌ను పరిశీలించిన న్యాయస్థానం ఈ కేసులో వర్చువల్‌గా హాజరయ్యేందకు అనుమతులు ఇచ్చింది. ఈ సందర్బంగా ఈ కేసును ఈ నెల 29కి వాయిదా వేసింది. కోర్టు అల్లు అర్జున్‌ను వర్చువల్‌గా హాజరు కావొచ్చంటూ ఇచ్చిన తీర్పు నేపథ్యంలో నెటిజన్స్ విభిన్నంగా స్పందిస్తున్నారు. మన దేశంలో డబ్బులున్న సెలబ్రిటీలకు ఓ న్యాయం.. సామాన్యులకు మరో న్యాయం అన్నట్టుగా ఉందనే కామెంట్స్ చేస్తున్నారు. అదే మాములు వ్యక్తి ఈయితే కోర్టు వర్చువల్‌గా హాజరయ్యేందుకు అనుమతులు ఇస్తుందా అనే కోణంలో ఎవరికి వారు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేస్తున్నారు. ఈ కేసులో ఏ11గా ఉన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో పాటు నిందితులంతా వ్యక్తిగతంగా హాజరుకావాలని గతంలో కోర్టు ఆదేశాలు ఇచ్చింది. తాజాగా కోర్టు తీర్పు వెలువరించడంతో బన్ని ఊపిరి పీల్చుకున్నాడు. గత విచారణకు వర్చువల్