పుష్ప’ తర్వాత బన్నీ రూటే మారింది.. టైమ్ ట్రావెల్ నుంచి సూపర్ హీరో వరకు భారీ లైనప్
Actor ProfileActor

పుష్ప’ తర్వాత బన్నీ రూటే మారింది.. టైమ్ ట్రావెల్ నుంచి సూపర్ హీరో వరకు భారీ లైనప్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
పుష్ప’ తర్వాత బన్నీ రూటే మారింది.. టైమ్ ట్రావెల్ నుంచి సూపర్ హీరో వరకు భారీ లైనప్
TV9 Telugu2 Dec 2026
పుష్ప’ తర్వాత బన్నీ రూటే మారింది.. టైమ్ ట్రావెల్ నుంచి సూపర్ హీరో వరకు భారీ లైనప్

పాన్ ఇండియా మార్కెట్ వచ్చాక అల్లు అర్జున్‌లో మార్పు మొదలైందా..? ఆ రేంజ్ కాపాడుకోవడానికి మామూలు కథల వైపు చూడటమే మానేశారా..? రొటీన్ కమర్షియల్ సినిమాలకు గుడ్ బై చెప్పి లార్జర్ దెన్ లైఫ్ కాన్సెప్ట్స్‌లకే ఓటేస్తున్నారా..? బన్నీ సెట్ చేసుకున్న ఫ్యూచర్ లైనప్ చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. అసలు అల్లు వారబ్బాయి చేయబోయే ఆ సినిమాలేంటి.. వాటి జానర్స్ ఏంటి..? పుష్పతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అల్లు అర్జున్.. ఇప్పుడు తన ఆ ఇమేజ్ కాపాడుకునే పనిలో పడ్డారు. అందుకే గతంలోలా కమర్షియల్ ఫార్ములా కథలకు దూరంగా ఉంటూ.. వీలైనంత వరకు సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు. తన స్టార్ డమ్‌కు తగ్గట్లుగా భిన్నమైన జోనర్స్ ఎంచుకుంటూ.. బాలీవుడ్ హీరోలకు సైతం వణుకు పుట్టించేలా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే అట్లీతో బన్నీ చేస్తున్న AA22 ప్రాజెక్ట్‌పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఇది పూర్తిగా టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో నడిచే సైన్స్ ఫిక్షన్ కథ అని తెలుస్తుంది. లార్జెర్ దెన్ లైఫ్ క్యారెక్టరైజేషన్‌తో వస్తున్న ఈ సినిమాని ఏకంగా 600 కోట్లతో సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఎక్కువగా ముంబైలోనే షూట్ చేస్తున్నారు అట్లీ. మాస్ ఆడియన్స్‌కు పూనకాలు తెప్పించే లోకేష్ కనకరాజ్‌తోనూ ఓ సినిమా చేస్తున్నారు బన్నీ. ఇది అడవి నేపథ్యంలో సాగే ఒక ఉత్కంఠభరితమైన అడ్వెంచరస్ థ్రిల్లర్. అందుకే మోషన్ పోస్టర్‌లో అడవితో పాటు సింహాన్ని హైలైట్ చేసారు మేకర్స్. 300 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించబోతున్నారు. హైదరాబాద్‌లోనే AA23 ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. ‘మిన్నల్ మురళి’ ఫేమ్ బాసిల్ జోసెఫ్‌తోనూ సినిమా చేయబోతున్నారు బన్నీ. బడ్జెట్ పరిమితులేం పెట్టుకోకుండా సూపర్ హీరో కాన్సెప్ట్‌తో గీతా ఆర్ట్స్ ఈ సినిమాను నిర్మించబోతుంది. ఇప్పటికే పక్కాగా స్క్రిప్ట్ లాక్ అయింది కూడా. ఇలా వరుసగా టైమ్ ట్రావెల్, అడ్వెంచరస్

ప ష ప తర వ త బన న ర ట మ ర ద ట మ ట ర వ ల న చ స పర హ ర వరక భ ర ల నప Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in