
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Markapur Marriage Incident News: మరికాసేపట్లో మూడు ముళ్ళు పడాల్సి ఉంది. ఇరు కుటుంబాల్లో పెళ్లి భాజలు, బంధువుల కేరింతలతో ఆ ప్రాంతమంతా పండగ వాతావరణం నెలకొంది. అంతలోని డాన్స్ విషయంలో వచ్చిన ఒకే ఒక్క చిన్న వివాదం వధూవరులు జీవితంలో ఊహించని మరుగు తిప్పింది. పెళ్లికూతురుని డాన్స్ చేయొద్దని వరుడు మందలించడంతో, పెళ్లి పీటల్లాగా వెళ్లాల్సిన వేడుక కాస్త ఊరేగింపులోనే అయిపోయింది. ప్రకాశం జిల్లా మార్కాపురం డివిజన్ పరిధిలో ఈ వింత ఉదంతం చోటుచేసుకుంది. ఏం జరిగింది అంటే? రాచర్ల మండలం చిన్నగానిపల్లి గ్రామానికి చెందిన యువకుడికి, కంభం మండలం తురిమెళ్ళకు చెందిన యువతీతో పెద్దలు వివాహం నిర్ణయించారు. ఆదివారం ఉదయం ముహూర్తం కావడంతో.. శనివారం రాత్రి వధువు తరుపు వారు పెళ్లికూతురుతో సహా చిన్నగానిపల్లికి చేరుకున్నారు. రాత్రివేళ ఇరువైపులా ఉన్న బంధుమిత్రులు, యువకులు ఉత్సాహంగా వధూవరులను వాహనం ఎక్కించి ఊరేగింపు ప్రారంభించారు. డీజే పాటలు మోతకు ఇరువైపుల వారి స్టెప్పులేస్తూ కేరింతల కొడుతూ ముందుకు సాగుతున్నారు. డాన్స్ గొడవ..సీన్ రివర్స్! ఊరేగింపు జోరుగా సాగుతున్న సమయంలో.. వధూవరులను కూడా డాన్స్ చేయాల్సిందిగా అక్కడున్న కొందరు కోరారు. దానికి వదులు ఎంత ఉత్సాహంగా సిద్ధమైంది. కానీ వరుడు మాత్రం తాను డాన్స్ చేసే ప్రసక్తి లేదని భేష్ నుంచి కూర్చున్నాడు. అంతటితో ఆగకుండా అందరి ముందు వధువువైపు తిరిగి నువ్వు కూడా డాన్స్ చేయడానికి వీలు లేదు అని గట్టిగా మందలించాడు. పెళ్లి కాకముందే అందరి ముందు కాబోయే భార్య వరుడు అలా కోప్పడడం