
సౌందర్య పేరు చెబితే మనకు ఆమె అద్భుతమైన నటన, ఆమె చీరకట్టు, సాంప్రదాయానికి ఆమె వేసిన పెద్ద పీఠ గుర్తుకొస్తాయి. అన్నింటికి మించి మంచి నటనతో మనల్ని అలరించిన తీరు గుర్తొస్తుంది. ఆమె ఇప్పుడు మన మధ్య లేకపోయినా సినిమాలతో అలరిస్తూనే ఉంది. ఇప్పటికీ అభిమానుల గుండెల్లో తన సినిమాలతో పదిలంగానే ఉంది. సౌందర్య గ్రీన్ యాక్ట్రెస్. కాలంతో సంబంధం లేకుండా, అన్ని జనరేషన్ ఆడియెన్స్ ఆమెని ఆరాధిస్తారంటే అతిశయోక్తి కాదు. ఇప్పటి తరం కూడా ఆమె సినిమాలు చూశారంటే ఫిదా అవ్వాల్సిందే. అంతగా ఆకట్టుకున్నా, తన సినిమాలతో అలరిస్తూనే ఉన్న సౌందర్య గురించి కొన్ని షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి. ఆమె కెరీర్ చివర్లో చేసిన తప్పులు ఇప్పుడు షాకిస్తున్నాయి. సౌందర్య 2004లో ఎన్నికల ప్రచారానికి వెళ్తూ హెలీకాఫ్టర్ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. బీజేపీ కోసం ఆమె ప్రచారం చేసింది. అయితే రెండు, మూడు లక్షలకు కక్కుర్తి పడి ఆమె తన ప్రాణాలు తీసుకుందని ఇటీవల ప్రముఖ సంచలన దర్శకుడు గీతా కృష్ణ షాకింగ్ కామెంట్ చేశారు. ఇప్పుడు ఆయన మరో సంచలన, షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు. సౌందర్య గురించి ఎవరూ ఇప్పటి వరకు ఇలాంటి వార్త విని ఉండరంటే అతిశయోక్తి కాదు. సౌందర్యకి సంబంధించి ఇతర హీరోలతో ఎఫైర్ రూమర్స్ వచ్చాయి. ప్రధానంగా జగపతిబాబు, వెంకటేష్‌తో వినిపించాయి. జగపతిబాబుని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యారని, ఆయన ఆమెతో పిల్లల్ని కనాలనుకున్నారనే వార్త వైరల్ అయ్యింది. దీనిపై జగపతిబాబు చాలా సార్లు స్పందించారు. అందులో నిజం లేదని, ఆమె మంచి స్నేహితురాలు అని, వారి ఫ్యామిలీతోనూ తనకు మంచి అనుబంధం ఉందని చెప్పారు. అదే సమయంలో వెంకటేష్‌ని కూడా సౌందర్య మ్యారేజ్ చేసుకోవాలనుకుందని, రామానాయుడు బెదిరించారనే మరో రూమర్ కూడా ఉంది. వీటిలో నిజాలేంటనేది తెలియదు. కానీ గీతా కృష్ణ మరో షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు. సౌందర్య పెళ్లి తర్వాత గాడి