పెళ్లి పేరుతో భారత మహిళలకు వల.. జైషే మహమ్మద్ కొత్త కుట్ర
Actor ProfileActor

పెళ్లి పేరుతో భారత మహిళలకు వల.. జైషే మహమ్మద్ కొత్త కుట్ర

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
పెళ్లి పేరుతో భారత మహిళలకు వల.. జైషే మహమ్మద్ కొత్త కుట్ర
AP7AM7 Nov 2026
పెళ్లి పేరుతో భారత మహిళలకు వల.. జైషే మహమ్మద్ కొత్త కుట్ర

పాకిస్థాన్‌కు చెందిన జైషే మహమ్మద్ (జేఇఎం) ఉగ్రవాద సంస్థ, భారత్‌లో విధ్వంసం సృష్టించేందుకు సరికొత్త, అత్యంత ప్రమాదకరమైన పన్నాగం పన్నింది. ప్రేమ, పెళ్లి పేరుతో భారతీయ మహిళలను వలలో వేసి, వారిని పాకిస్థాన్‌కు తరలించి, ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగించుకోవాలని చూస్తోంది. ఈ కుట్రను భారత నిఘా వర్గాలు (ఐబీ) ఛేదించాయి. జైషే చీఫ్ మసూద్ అజార్ సోదరి సాదియా అజార్ నేతృత్వంలో గతేడాది అక్టోబర్‌లో ఏర్పాటైన 'జమాత్-ఉల్-మోమినాత్' (జేయుఎం) అనే మహిళా విభాగం ఈ కుట్రకు కేంద్రంగా పనిచేస్తున్నట్టు అధికారులు గుర్తించారు.ఆన్‌లైన్ ప్రేమ.. పాకిస్థాన్‌లో శిక్షణఐబీ అధికారుల కథనం ప్రకారం.. ఈ ఉగ్రముఠాలోని యువకులు భారతీయ మహిళలతో సోషల్ మీడియా ద్వారా పరిచయం పెంచుకుంటున్నారు. ముఖ్యంగా పాకిస్థాన్ సరిహద్దులకు సమీపంలో నివసించే మహిళలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. సుమారు ఆరు నెలల పాటు వారితో ఆన్‌లైన్‌లో మాట్లాడుతూ, ప్రేమ నటిస్తూ నమ్మకం పెంచుతారు. తాము నిజమైన ప్రేమలో ఉన్నామని, పెళ్లి చేసుకుని మంచి జీవితం ఇస్తామని నమ్మిస్తారు. ఈ సమయంలో గూఢచర్యానికి సంబంధించిన సున్నితమైన ప్రశ్నలు ఏవీ అడగకుండా జాగ్రత్తపడతారు. పూర్తిగా వారిని నమ్మించి, పెళ్లికి ఒప్పించిన తర్వాత పాకిస్థాన్‌కు రప్పించేందుకు ప్రయత్నిస్తారు. పాకిస్థాన్‌కు చేరాక, వారిని ఉగ్రవాద భావజాలంతో నింపి, గూఢచారులుగా మార్చి తిరిగి భారత్‌కు పంపేందుకు ప్లాన్ చేస్తున్నారు.జమ్మూకశ్మీర్ నుంచి రాజస్థాన్‌పైకి దృష్టిగతంలో ఇలాంటి కార్యకలాపాలు జమ్మూకశ్మీర్‌కే పరిమితం కాగా, ఇప్పుడు ఉగ్రవాదులు తమ దృష్టిని రాజస్థాన్‌పైకి మార్చారు. పాకిస్థాన్‌తో రాజస్థాన్‌కు 1,070 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు ఉండటమే దీనికి ప్రధాన కారణం. శ్రీ గంగానగర్

ప ళ ల ప ర త భ రత మహ ళలక వల జ ష మహమ మద క త త క ట ర Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in