పెళ్లి చేసుకోనున్న సానియా మీర్జా
Actor ProfileActor

పెళ్లి చేసుకోనున్న సానియా మీర్జా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
పెళ్లి చేసుకోనున్న సానియా మీర్జా
Sakshi12 Jan 2027
పెళ్లి చేసుకోనున్న సానియా మీర్జా

భార‌త మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా త్వ‌రలో పెళ్లి చేసుకోనుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.ఈ వార్త‌ల్లో నిజ‌మెంతో తెలియ‌దు కానీ ఈసారి కూడా విదేశీ వ‌రుడినే పెళ్లి చేసుకోనున్న‌ట్లు సోష‌ల్ మీడియాలో పోస్టులు వైర‌ల్ అవుతున్నాయి. గ‌తంలో పాక్ మాజీ క్రికెట‌ర్ షోయ‌బ్ మాలిక్‌ను వివాహ‌మాడిన సానియా 14 సంవ‌త్స‌రాల వైవాహిక బంధం త‌ర్వాత అత‌డి నుంచి విడిపోయింది. 2024లో వీరిద్ద‌రు విడాకులు తీసుకున్నారు. అప్ప‌టినుంచి దుబాయ్‌లో కొడుకు ఇజాన్‌తో కలిసి సింగిల్ లైఫ్ లీడ్ చేస్తూ వ‌చ్చింది. అయితే తాజాగా త‌న కుమారుడికి ఒక తండ్రి అవ‌స‌ర‌మ‌ని భావించిన సానియా మీర్జా రెండో పెళ్లికి సిద్ధ‌మైన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఎవ‌రా వ్య‌క్తి? మ‌రి 2024 నుంచి దుబాయ్‌కి మ‌కాం మార్చిన సానియా మీర్జా త‌న స్నేహితుడైన ఒక విదేశీయుడితో రిలేషిన్‌షిప్‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. అతడు కూడా దుబాయ్‌లో ఉంటున్నాడ‌ని, అందుకే సానియా అక్క‌డే ఒక ఖ‌రీదైన అపార్ట్‌మెంట్ కొనుగోలు చేసి నివాసం ఉంటున్నార‌ని చెప్పుకుంటున్నారు. ఇక భార‌త్‌లో ఉన్న త‌న కుటుంబ‌స‌భ్యుల‌కు త‌న రిలేషిన్‌షిప్ గురించి సానియా మీర్జా వెల్ల‌డించింద‌ని, కూతురు పెళ్లికి వాళ్లు కూడా అంగీక‌రించిన‌ట్లు తెలుస్తోంది. అయితే సానియా కుటుంబ స‌భ్యుల నుంచి మాత్రం ఎలాంటి ప్ర‌క‌ట‌న రాలేదు. ఒక‌వేళ సానియా మీర్జా పెళ్లి చేసుకుంటే మాత్రం దుబాయ్‌లో స‌న్నిహితుల స‌మ‌క్షంలోనే వివాహం జ‌రుగుతుంద‌నే చ‌ర్చ మొద‌లైంది. ఈ వార్త‌ల్లో నిజ‌మెంతో తెలియాలంటే సానియా మీర్జా స్పందించేవ‌ర‌కు ఆగాల్సిందే. టెర్రాకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా.. మరోవైపు సానియా మీర్జా నుంచి విడాకులు తీసుకున్న తర్వాత షోయబ్ మాలిక్ మూడో వివాహం చేసుకున్నాడు. పాకిస్తాన్ నటి సనా జావేద్‌ను పెండ్లి చేసుకున్నాడు. ఇక సింగిల్ లైఫ్ లీడ్ చేస్తున్న సానియా మీర్జా ఇటీవ‌లే టెర్రా ఇన్‌వెస్ట్‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఎంపికైంది. టెన్నిస్‌లో భార‌త్‌కు ప్రాతినిధ్యం వ‌హించిన సానియా మీర్జా డ‌బుల్స్‌లో నంబ‌ర్‌వ‌న్ ర్యాంకు సాధించింది.డ‌బుల్స్‌లో ఆరు మేజ‌ర్‌ టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ కైవ‌సం