
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Aishwarya Lekshmi Comments On Marriage: ఇటీవలి కాలంలో సినీ పరిశ్రమకు చెందిన పలువురు హీరోయిన్లు ప్రేమ, పెళ్లి, సహజీవనం వంటి సున్నితమైన విషయాలపై చాలా బాహాటంగా, బోల్డ్‌గా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. తాజాగా, సౌత్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య లక్ష్మి వివాహ వ్యవస్థపై చేసిన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. మలయాళ కుట్టి..టాలీవుడ్ ఎంట్రీ కేరళలో పుట్టి పెరిగిన ఐశ్వర్య లక్ష్మి తమిళ, మలయాళ చిత్రాల్లో స్టార్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సత్యదేవ్ సరసన నటించిన 'గాడ్సే' చిత్రంతో ఈమె టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. ఆ తర్వాత నాని నిర్మించిన 'హిట్-2' సినిమాలోనూ కీలక పాత్రలో మెరిశారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ సరసన 'సంబరాల ఏటిగట్టు' అనే క్రేజీ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నారు. ఆలోచనలో పడేసిన 'మట్టి కుస్తీ 2' ఐశ్వర్య లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన తాజా తమిళ చిత్రం 'గట్ట కుస్తీ' (తెలుగులో 'మట్టి కుస్తీ 2') బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఇందులో భార్యగా, ఒక బిడ్డకు తల్లిగా, రెజ్లర్‌గా ఆమె చూపించిన నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. గతంలో పలుమార్లు తనకు "పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు" అని ప్రకటించిన ఈ 35 ఏళ్ల బ్యూటీ ఈ సినిమా ప్రమోషన్ల సందర్భంగా తన మనసులోని సరికొత్త భావాలను పంచుకున్నారు. ఐశ్వర్య లక్ష్మి అసలు ఏమన్నారంటే..? వివాహ బంధంపై తనకున్న