పాలిటిక్స్ లోకి ధనుష్.. ఈ హడావుడి అంతా అందుకేనా
Actor ProfileActor

పాలిటిక్స్ లోకి ధనుష్.. ఈ హడావుడి అంతా అందుకేనా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
పాలిటిక్స్ లోకి ధనుష్.. ఈ హడావుడి అంతా అందుకేనా
Chitrajyothy30 Sept 2026
పాలిటిక్స్ లోకి ధనుష్.. ఈ హడావుడి అంతా అందుకేనా

ఈ మధ్యకాలంలో తమిళనాట రాజకీయాలు చాలా రసవత్తరంగా మారుతున్నాయనే విషయం తెలియంది కాదు. స్టార్ హీరో విజయ్ పోటీ చేసిన మొదటి ఎన్నికలలోనే గెలిచి, రికార్డ్ క్రియేట్ చేసి, సీఎంగా పాలన చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో తమిళనాట రాజకీయాలు (Tamil Nadu Politics) చాలా రసవత్తరంగా మారుతున్నాయనే విషయం తెలియంది కాదు. స్టార్ హీరో విజయ్ (Star Hero Vijay) పోటీ చేసిన మొదటి ఎన్నికలలోనే గెలిచి, రికార్డ్ క్రియేట్ చేసి, సీఎంగా పాలన చేస్తున్నారు. ఆయన పాలనకు సంబంధించి రోజూ ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంది. ప్రస్తుతం ఆయన పాలనపై అవగాహన నేర్చుకుంటూనే, కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంటూ.. సమర్థవంతమైన నాయకుడినని అనిపించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇదిలా ఉంటే, ఇప్పుడు తమిళనాడుకు చెందిన మరో స్టార్ హీరో కూడా రాజకీయాల్లోకి రాబోతున్నట్లుగా కోలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు హైలెట్ అవుతున్నాయి. ఆ హీరో ఎవరో కాదు.. ధనుష్ (Dhanush). అవును, ధనుష్ రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారనే ప్రచారం కోలీవుడ్‌లో జోరుగా నడుస్తోంది. అందుకు కారణం.. ధనుష్ తన అభిమాన సంఘాలను యాక్టివ్ చేయడమే. తన అభిమానులను పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనాలని ధనుష్ సూచించడంతో పాటు, ఇటీవల తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్‌ను ఆయన కలవడంతో ఈ ఊహాగానాలు మొదలయ్యాయి. రాబోయే ఎన్నికల నాటికి సాధ్యమైనంతగా ధనుష్ ప్రజలలో ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లుగా కోలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మరి నిజంగా ధనుష్ రాజకీయాలలోకి వస్తారా? లేదంటే, కేవలం సేవా కార్యక్రమాలకే పరిమితం అవుతారా? ఒకవేళ నిజంగా ధనుష్ రాజకీయాలలోకి వచ్చినా, విజయ్‌లా సక్సెస్ అవుతారా? రికార్డ్ క్రియేట్ చేస్తారా? కొత్త పార్టీ పెడతారా? లేదంటే ఏదైనా పార్టీ బాధ్యతలు తీసుకుంటారా? అంటే.. అందుకు కాలమే సమాధానం చెప్పాలి. ఇక ధనుష్ పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. మరి వైరల్ అవుతున్న ఈ వార్తలపై ధనుష్

ప ల ట క స ల క ధన ష ఈ హడ వ డ అ త అ ద క న Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in