
హైదరాబాద్: వైద్య విద్యార్థిని ప్రియాంక (28) మృతదేహానికి గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం పూర్తయ్యింది. మృతదేహాన్ని ఆమె స్వస్థలం గద్వాల్ జిల్లా ఐజా మండలం ఎక్లాస్‌పూర్‌కి కుటుంబ సభ్యులు తరలించనున్నారు. ఆస్పత్రి వద్ద ప్రియాంక తండ్రిని మంత్రి వాకిటి శ్రీహరి, రాజమహేంద్రవరం అర్బన్ ఎమ్మెల్యే శ్రీనివాస్ ఓదార్చారు. ప్రియాంక మృతదేహం వెంట గ్రామానికి రాజమహేంద్రవరం తెదేపా అధ్యక్షుడు వెంకట రమణా చౌదరి వెళ్లనున్నారు. స్వగ్రామానికి ఏపీ మంత్రి టీజీ భరత్ వెళ్లి.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన 20 లక్షల రూపాయల చెక్‌ను ప్రియాంక తండ్రికి అందజేయనున్నారు. రాజమహేంద్రవరంలో ఇద్దరు యువకులు మద్యం మత్తులో నిర్లక్ష్యంగా కారు నడిపి ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడిన వైద్య విద్యార్థిని ప్రియాంక (28) ఆదివారం మృతి చెందిన విషయం తెలిసిందే. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
