
సాంస్కృతిక వారసత్వమే భారత్-ఇండోనేసియాలను కలిపి ఉంచుతోందని ప్రఽధాని మోదీ అన్నారు. భౌగోళిక భిన్నత్వం కలిగిన రెండుదేశాల మధ్య సముద్రం వారధిగా ఉన్నదని తెలిపారు.. జకార్తా, జూలై 8: సాంస్కృతిక వారసత్వమే భారత్-ఇండోనేసియాలను కలిపి ఉంచుతోందని ప్రఽధాని మోదీ అన్నారు. భౌగోళిక భిన్నత్వం కలిగిన రెండుదేశాల మధ్య సముద్రం వారధిగా ఉన్నదని తెలిపారు. ఇండోనేసియా పర్యటనలో భాగంగా బుధవారం ఆ దేశ అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతోతో కలిసి మోదీ ప్రసిద్ధ ప్రంబనన్ ఆలయ కాంప్లెక్స్‌ను సందర్శించారు. యోగ్యకార్త నుంచి ప్రంబనన్ ఆలయ కాంప్లెక్స్ వరకు ఇరువురు నేతలు గగనమార్గంలో ప్రయాణిస్తూ ఆ ప్రాంతాలను వీక్షించారు. అనంతరం ఆలయంలోని బ్రహ్మ, శివ, విష్ణు మూర్తులకు భక్తితో మోదీ పూజలు నిర్వహించారు. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద జాబితాలోని ఈ ప్రాచీన హిందూ ఆలయానికి వెయ్యేళ్లకు పైగా చరిత్ర ఉంది. ఇది ఆగ్నేయాసియాలోనే అతి పెద్ద హిందూ క్షేత్రం. ఇంతగొప్ప చారిత్రక వారసత్వాన్ని పరిరక్షిస్తున్న ఇండోనేసియా ప్రజలకు ఈ సందర్భంగా మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రంబనన్ ఆలయ కాంప్లెక్స్ పునరుద్ధరణ ప్రాజెక్టులో భాగం కావడం భారత్‌కు గర్వకారణమని పేర్కొన్నారు. ‘‘ఇక్కడి గాలులు సాంస్కృతిక పరిమళాలను మోసుకువస్తాయని మాటల సందర్భంలో విన్నాను. ఈ పరిమళాలను భారత్ ప్రతి క్షణమూ ఆస్వాదిస్తోంది. ఈ పరిమళం, ఈ సాంస్కృతిక వారసత్వమే మనల్ని కలిపి ఉంచుతోంది’’ అని మోదీ అన్నారు. ఆలయ ప్రాంగణంలో ‘మహా మృత్యుంజయ’, ‘ఓం నమః శివ’ మంత్రాలను విని తన హృదయం పులకించిందన్నారు. ‘‘ఎక్కడకు వెళ్లినా శివ దర్శనం కావడం నేను చేసుకున్న గొప్ప అదృష్టం. నేను పుట్టి పెరిగిన గుజరాత్‌లోని వాడ్‌నగర్‌లో హట్కేస్వర్ మహాదేవ్ ఆలయం ఉంది. సోమనాథుని తొలి జ్యోతీర్లింగం గుజరాత్‌లోనే ఉంది. నా నియోజకవర్గం వారాణసీ కాశీ విశ్వనాథుడు కొలువైన క్షేత్రం’’ అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, హిందూ దేవతలు, ఆలయాలకు నెలవైన ఇండోనేసియాలోని అతి పెద్ద ఆలయమే ప్రబంనన్. ఇది ఆగ్నేయాసియాలోని రెండో అతి