పౌరసత్వ నిర్ధారణ న్యాయబద్ధంగా ఉండాలి.. అస్సాం ఫారినర్స్’ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు
Actor ProfilePolitician

పౌరసత్వ నిర్ధారణ న్యాయబద్ధంగా ఉండాలి.. అస్సాం ఫారినర్స్’ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
పౌరసత్వ నిర్ధారణ న్యాయబద్ధంగా ఉండాలి.. అస్సాం ఫారినర్స్’ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు
Andhra Jyothy6 Nov 2026
పౌరసత్వ నిర్ధారణ న్యాయబద్ధంగా ఉండాలి.. అస్సాం ఫారినర్స్’ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు

పౌరసత్వాన్ని నిర్ధారించే లేదా ఒక వ్యక్తిని విదేశీయుడిగా ప్రకటించే ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, న్యాయబద్ధంగా ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అస్సాంలో 27 మంది వ్యక్తుల పౌరసత్వ స్థితిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు తీర్పునిచ్చింది. ఢిల్లీ, జులై 13: పౌరసత్వాన్ని నిర్ధారించే లేదా ఒక వ్యక్తిని విదేశీయుడిగా (Foreigner) ప్రకటించే ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, న్యాయబద్ధంగా ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అస్సాం లోని ఫారినర్స్ ట్రిబ్యునళ్లు ‘విదేశీయులు’గా ప్రకటించిన 27 మంది వ్యక్తుల పౌరసత్వ స్థితిపై ఇవాళ (సోమవారం) విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు కీలక తీర్పునిచ్చింది. 'పౌరసత్వం, విదేశీయుడి హోదా అనేవి అత్యున్నత రాజ్యాంగ, చట్టపరమైన ప్రాముఖ్యత కలిగిన అంశాలు' అని ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. అక్రమంగా పౌరసత్వం పొందాలని చూసే వారిని నిరోధించడంలో ప్రభుత్వానికి స్పష్టమైన ప్రయోజనాలు, బాధ్యతలు ఉంటాయనే విషయాన్ని సుప్రీంకోర్టు అంగీకరించింది. 'చట్టబద్ధంగా అర్హత లేని వ్యక్తులు.. తప్పుడు పత్రాలు, తప్పుడు క్లెయిమ్‌ల ద్వారా భారతీయ పౌరసత్వాన్ని పొందకుండా చూసేందుకు ప్రభుత్వానికి చట్టబద్ధమైన, బలమైన ఆసక్తి ఉంటుంది. అయితే, తుది విశ్లేషణలో ఆ ఆసక్తి లేదా ప్రయోజనం.. న్యాయబద్ధమైన ప్రక్రియను అధిగమించలేవు'. అని ధర్మాసనం పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి గతంలో గౌహతి హైకోర్టు, ఫారినర్స్ ట్రిబ్యునళ్లు ఇచ్చిన తీర్పులను సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. ట్రిబ్యునళ్లలో ఈ కేసుపై మరోసారి విచారణ జరిగే వరకు ఆ 27 మంది వ్యక్తులపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకూడదని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. అయితే, పిటిషనర్ల పౌరసత్వాన్ని నిర్ధారించడానికి తాము ఇంకా ఎటువంటి ఆధారాలను పూర్తిగా పరిశీలించలేదని జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. చిన్న చిన్న తప్పులకే 'విదేశీయులు'గా ముద్ర! కోర్టును ఆశ్రయించిన వారిలో సాబిత్రి దేయ్, అజ్బహర్ అలీ, ఎండీ అక్బర్ అలీ, అబేదా ఖాతూన్, అనోవారా ఖాతూన్ అనే వ్యక్తులు

ప రసత వ న ర ధ రణ న య యబద ధ గ ఉ డ ల అస స ఫ ర నర స క స ల స ప ర క ర ట క లక త ర ప Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in