
ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం పత్రికా రంగం అయితే, నేటి ఆధునిక సమాజంలో సామాన్యుడి ఆయుధం, ఐదో స్తంభం 'సోషల్ మీడియా'. కోట్లాది మంది ప్రజలు తమ భావాలను పంచుకోవడానికి, పాలకుల తప్పులను ఎండగట్టడానికి, సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై ప్రశ్నించడానికి సోషల్ మీడియా ఒక వేదికగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా సామాజిక మాధ్యమాలు విప్లవాత్మక మార్పులు తీసుకువస్తూ, పాలకులలో జవాబుదారీతనాన్ని పెంచుతుంటే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం భిన్నమైన, తీవ్ర ఆందోళనకరమైన మార్గంలో ప్రయాణిస్తోంది. ప్రభుత్వ విధానాలను విమర్శించే వారిని, సామాజిక మాధ్యమాలలో ప్రశ్నించే వారిని కట్టడి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ తీసుకున్న తాజా నిర్ణయం ప్రజాస్వామ్య స్ఫూర్తికే గొడ్డలిపెట్టు. ఇది కేవలం ఒక వర్గాన్నో, ఒక పార్టీ కార్యకర్తనో కట్టడి చేసే చర్య కాదు. పౌరుల ప్రాథమిక హక్కు అయిన ‘భావ ప్రకటన స్వేచ్ఛ’ను ఖూనీ చేసే కుట్ర. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులలో భావ ప్రకటన స్వేచ్ఛ అత్యంత కీలకమైనది. ప్రభుత్వం తప్పు చేసినప్పుడు నిలదీసే హక్కు, విమర్శించే హక్కు ప్రతి పౌరుడికీ ఉంటుంది. కానీ నేడు ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి చూస్తుంటే విమర్శిస్తే అర్ధరాత్రి అరెస్టులు, ప్రశ్నిస్తే చాలు అక్రమ కేసులు బనాయించే సంస్కృతి రాజ్యమేలుతోంది. ఇటీవల కాలంలో పోలీసులు ఏర్పాటు చేసిన సోషల్ మీడియా మానిటరింగ్ యూనిట్లు, ప్రభుత్వ విమర్శకులను ఏరివేసే ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌లు రాజ్యాంగ రక్షణల కంటే పాలకుల అజెండాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయనేది స్పష్టమవుతోంది. తాజాగా క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం వెనుక ఉన్న అసలు ఉద్దేశం సోషల్ మీడియాను క్రమబద్ధీకరించడం కాదు, పాలకులపై వస్తున్న వ్యతిరేక గొంతులను శాశ్వతంగా నొక్కేయడమేనని మేధావులు, హక్కుల సంఘాల నేతలు భావిస్తున్నారు. తప్పులను సరిదిద్దుకోవాల్సిన పాలకులు, తప్పులను ఎత్తిచూపిన వారిపై పగబట్టడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి దాకా సోషల్ మీడియా కార్యకర్తలు, స్వతంత్ర యూట్యూబర్లపై జరుగుతున్న దాడులు