ప్రశ్న రావణ్ వెనుక తెలుగు దేశం.. కొడాలి నాని వ్యాఖ్యల వెనుక వ్యూహం అదేనా
Actor ProfilePolitician

ప్రశ్న రావణ్ వెనుక తెలుగు దేశం.. కొడాలి నాని వ్యాఖ్యల వెనుక వ్యూహం అదేనా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ప్రశ్న రావణ్ వెనుక తెలుగు దేశం.. కొడాలి నాని వ్యాఖ్యల వెనుక వ్యూహం అదేనా
TeluguOne15 Oct 2026
ప్రశ్న రావణ్ వెనుక తెలుగు దేశం.. కొడాలి నాని వ్యాఖ్యల వెనుక వ్యూహం అదేనా

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు కొడాలి నాని రూటే సెపరేటు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత రెండేళ్లుగా ఆయన వీలైనంత వరకు ప్రభుత్వ నిఘా నేత్రం నుండి తప్పించుకుంటూ, లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. అదే సమయంలో వైసీపీలో తన ఇంపార్టెన్స్ తగ్గకుండా, పార్టీ క్యాడర్ తనను మరచిపోకుండా క్రమం తప్పకుండా మీడియా ముందుకు వస్తూ.. ఏదో ఒక సంచలన వ్యాఖ్యతో వార్తలలో ఉంటున్నారు. తాజాగా గుడివాడలో కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. యూట్యూబర్ రావణ్ అరెస్ట్ ఉదంతంపై.. తనదైన శైలిలో తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో కొత్త రాజకీయ కుట్ర సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు. ప్రశ్న రావణ్ కేసు విషయంలో కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. యూట్యూబర్ రావణ్ తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడని, ఆయన నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ, నారా చంద్రబాబు నాయుడుల కోసమే పనిచేస్తాడని ఆరోపించిన కొడాలి నాని.. ప్రశ్న రావణ్ టిడిపి నాయకులకు వ్యతిరేకంగా ఒక్కవ్యాఖ్య కూడా చేయలేదని కొడాలి నాని ఈ సందర్భంగా చెప్పారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడూ, ఇప్పుడు అధికారంలో లేని సమయంలోనూ కూడా ప్రశ్న రావణ్ వైసీపీ నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసినా.. తాము ఎప్పుడూ అతడిని అణచివేయడానికి ప్రయత్నించలేదని చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం మాత్రం, ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపేవారిని కొత్త చట్టాల పరిధిలోకి తెస్తూ, 'ఉప్మా', 'ఇడ్లీ' కేసులు పెడుతూ జైళ్లలో పెడుతోందంటూ సెటైర్లు వేశారు. అయితే నాని వ్యాఖ్యల వెనుక ఉద్దేశం మాత్రం వేరే ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెలుగుదేశం, జనసేన చెలిమిని చెడగొట్టాలన్న వ్యూహంతోనే కొడాలి నాని.. ప్రశ్న రావణ్ జనసేనాని పవన్ కల్యాణ్ పై చేసిన వ్యాఖ్యల వెనుక తెలుగుదేశం ఉందన్న వాదనను తెరమీదకు తీసుకువచ్చారంటున్నారు. అయితే జనం కొడాలి నాని కుట్ర సిద్ధాంతాన్ని విశ్వసించే పరిస్థితి కనిపించడం లేదని

ప రశ న ర వణ వ న క త ల గ ద శ క డ ల న న వ య ఖ యల వ న క వ య హ అద న Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in