ప్రవాసాంధ్రులంతా ఏపీ బ్రాండ్ అంబాసిడర్లే
Actor ProfilePolitician

ప్రవాసాంధ్రులంతా ఏపీ బ్రాండ్ అంబాసిడర్లే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ప్రవాసాంధ్రులంతా ఏపీ బ్రాండ్ అంబాసిడర్లే
Telugu Times24 Sept 2026
ప్రవాసాంధ్రులంతా ఏపీ బ్రాండ్ అంబాసిడర్లే

మీతో క‌లిసి ప‌నిచేయ‌డానికి సిద్ధంగా ఉన్నాం భారత్ లో కొరియాకు నమ్మకమైన భాగస్వామి ఆంధ్రప్రదేశ్ కియా లాంటి మరిన్ని సక్సెస్ స్టోరీల కోసం ఎదురు చూస్తున్నాం సియోల్ తెలుగు డయాస్పోరా సమావేశంలో ఏపీ మంత్రి లోకేష్ సియోల్ (సౌత్ కొరియా): ఇక్కడ మీలో ఉన్న ప్రతిఒక్కరూ ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్లే. మీరు విజయాన్ని సాధించినప్పుడు, వ్యాపారం ప్రారంభించినప్పుడు, మంచి పేరును సంపాదించినప్పుడల్లా ఆంధ్రప్రదేశ్ గర్వపడుతుంది. మీరు వెళ్ళే ప్రతీచోట ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గాథను చెప్పాలన్నది నా ఆకాంక్ష అని ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. సియోల్‌లో తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ... `మన రాష్ట్రంలో ఉన్న అవకాశాలను వివరించండి, వేగవంతమైన అనుమతులు, పారదర్శక పాలనను తెలియజేయండి. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరండి. ఒకసారి మనరాష్ట్రాన్ని చూసినవారు... వెంటనే మన ప్రాంతాన్ని ఎంపిక చేసుకుంటారు. ఏ రంగంలోనైనా క‌లిసి ప‌నిచేయ‌డానికి ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉంది. మేం నిజాయితీతో ప్రతి పెట్టుబడిదారుడికీ స్వాగతం పలుకుతాం. ప్రతి ఆవిష్కర్త కంపెనీని మేం ఆదరిస్తాం. భారతదేశంతో కలిసి పనిచేసే ఆసక్తి ఉన్న ప్రతీ వ్యక్తికీ మేము స్వాగతం పలుకుతాం.` ఎన్ఆర్ఐల ప్ర‌తి విజ‌యం దేశానికి గ‌ర్వ‌కార‌ణం ప్రపంచంలో తెలుగు ప్రజలు లేని దేశం లేదు. ఏ దేశంలో, ఏ ప్రాంతానికి వెళ్లినా అక్కడ తెలుగు ప్రజల ఉనికి ఉంటుంది. నేను ఎక్కడికెళ్లినా నా పరిచయాలు తెలుగు సమాజంతోనే మొదలవుతాయి. విదేశాల్లో ఉంటున్న తెలుగువారికి తమ దేశం, సంస్కృతిపై అపారమైన ప్రేమ. వారు ఎంత దూరంలో ఉన్నా భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తారు. దక్షిణ కొరియాలోని భారతీయ సమాజానికి నా హృదయపూర్వక అభినందనలు. ఎంబసీ అధికారులు, నిర్వాహకులు, ఈ వేదిక ఏర్పాటుచేసిన ప్రతీ ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేశం నుంచి దూరంగా ఉన్న ప్రతీ భారతీయుడినీ కలిసిన ప్రతిసారీ నాకు ఒకింత గర్వంగా ఉంటుంది. మీ

ప రవ స ధ ర ల త ఏప బ ర డ అ బ స డర ల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in