
అన్నవరం : కాకినాడ జిల్లా అన్నవరం ఆర్టీసీ బస్టాండ్‌ను మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. బస్టాండ్‌లో పలువురు ప్రయాణికులతో మాట్లాడారు. స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణం పథకంపై మహిళా ప్రయాణికుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ పథకం అమలుపై వారు ఆనందం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు సారథ్యంలో స్త్రీ శక్తి పథకం విజయవంతంగా అమలవుతోందని మహిళలు తెలిపారు. అన్నవరం బస్టాండ్‌లో అందుతున్న సదుపాయాలపై మంత్రి ఆరా తీశారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆర్టీసీ క్యాంటీన్‌ను సందర్శించారు. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బందితో కలిసి అల్పాహారం చేశారు. అనంతరం ఆర్టీసీ కార్మికులతో ఆత్మీయంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు